ఆచార్య సినిమా డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలు చవిచూశారు. ఈ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు తమ వంతు సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చారు
భారీ అంచనాల మధ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చిరంజీవి , రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా అయినప్పటికీ ఈ సినిమా మెగా అభిమానులను మెప్పించడంలో పూర్తి స్దాయిలో విఫలమైంది. ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు భారీగానే నష్టపోయారు. అంతేకాదు చిరంజీవి మార్కెట్ కూడా ఈ సినిమాతో బాగానే దెబ్బతిందని సమాచారం. చిరంజీవి తదుపరి చిత్రాల బిజినెస్ పై ఆచార్య ఎఫెక్ట్ పడనుంది. దాంతో చిరంజీవి ఓ డెసిషన్ తీసుకున్నట్లు చెప్తున్నారు.
సాధారణంగా సినిమా ప్రారంభానికి ముందు రెమ్యునేషన్ తీసుకునే చిరంజీవి ...తనకు ఇప్పుడేమీ ఇవ్వవద్దని నిర్మాతలకు చెప్తున్నారట. సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన లాభాలను బట్టి వాటా తీసుకుంటాను అని చెప్తున్నారట. సైరా సినిమాకు, ఆచార్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్స్ కు సెటిల్మెంట్ చేయాల్సి రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. చిరు తీసుకున్న ఈ నిర్ణయం తో ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు రిలీఫ్ ఫీలయ్యారట.
చిరంజీవి చేతిలో ఇప్పుడు వరస భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో మూడు ప్రస్తుతం సెట్స్ పైన ఉన్నాయి. అవే గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య, మరియు భోళా శంకర్. వీటిన్నటికి వచ్చిన లాభాలను బట్టి అందులో చిరు కొంత వాటా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఇచ్చిన అడ్వాన్స్ లు మినహా మినహా మిగతా సొమ్ముని ప్రొడక్షన్ లో పెట్టమని చెప్పారట. గాడ్ ఫాదర్ మరియు భోళా శంకర్ సినిమాలకి కూడా ఇదే దారిలో వెళ్ళనున్నారు మెగాస్టార్. చిరంజీవి అనుకరిస్తున్న ఈ ఫార్ములా నిర్మాతలకు బాగా మేలు చేస్తుందని చెప్తున్నారు.
ఇక ఆచార్య సినిమా డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలు చవిచూశారు. ఈ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు తమ వంతు సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చారు డైరెక్టర్ కొరటాల శివ. నష్టనివారణ చర్యల్లో భాగంగా పాతిక కోట్ల దాకా తిరిగి డిస్ట్రిబ్యూటర్లకు వెనక్కి ఇచ్చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి కొరటాల శివ ఈ సినిమా కోసం అన్ని తానై నడిపించారు. సినిమా బిజినెస్ విషయంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు సినిమా వల్ల నష్టం వాటిల్లడంతో తన బాధ్యతగా పాతిక కోట్లు వెనక్కి తిరిగి ఇచ్చేశారంటున్నారు. అయితే సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల ఒక డైరెక్టర్ ఇంత పెద్ద మొత్తాన్ని వెనక్కి తిరిగి చేయటం తెలుగులో ఇదే మొట్టమొదటిసారి కావచ్చు. మరోవైపు మెగాస్టార్ కూడా తనవంతు సహాయంగా 10 కోట్లను తిరిగి ఇచ్చేసినట్లు చెప్తున్నారు.