సాయిధరమ్‌ తేజ్‌ `రిపబ్లిక్‌` చిత్రంపై రేవంత్‌రెడ్డి, సీతక్క ప్రశంసలు

Published : Oct 03, 2021, 08:49 PM IST
సాయిధరమ్‌ తేజ్‌ `రిపబ్లిక్‌` చిత్రంపై  రేవంత్‌రెడ్డి, సీతక్క ప్రశంసలు

సారాంశం

పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ పుష్పగుచ్చాలు పంపించారు. నారా లోకేష్‌ ట్విట్టర్‌ ద్వారా సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, సింగర్‌ స్మిత తదితరులు ఈ చిత్రాన్ని స్పెషల్‌గా వీక్షించారు. 

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన `రిపబ్లిక్‌` చిత్రం అక్టోబర్‌ 1న విడుదలై మిశ్రమ స్పందనని రాబట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రాన్ని, చిత్ర యూనిట్‌ని అభినందిస్తూ పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ పుష్పగుచ్చాలు పంపించారు. నారా లోకేష్‌ ట్విట్టర్‌ ద్వారా సినిమాపై ప్రశంసలు కురిపించారు. 

తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, సింగర్‌ స్మిత తదితరులు ఈ చిత్రాన్ని స్పెషల్‌గా వీక్షించారు. అనంతరం వారు సినిమాపై ప్రశంసలు కురిపించారు. సినిమా వారికి బాగా నచ్చిందని, ఇంత మంచి సందేశాత్మక చిత్రాన్ని తీసిన టీమ్‌ని అభినందించారు. ఈ సందర్భంగా దర్శకుడు దేవా కట్టాతో దిగిన ఫోటో వైరల్‌ అవుతుంది.

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా, ఐశ్వర్య రాజేష్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవా కట్టా దర్శకత్వం వహించగా, భగవాన్‌, పుల్లారావు నిర్మించారు. ఇందులో జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. కొల్లేరు సరస్సు వెనకాల జరిగిన రాజకీయ కుట్రల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Sudigali Sudheer Rashmi Gautam లవ్‌ స్టోరీ తెగతెంపులు.. అందరి ముందు ఓపెన్‌గా ప్రకటించిన జబర్దస్త్ కమెడియన్‌
కాసుల వర్షం కురిపిస్తున్న రాజా సాబ్, ప్రభాస్ సినిమా 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?