భీమ్లా నాయక్‌ అప్‌డేట్‌ః ఐశ్వర్య ఔట్‌.. సంయుక్త మీనన్‌ ఇన్‌.. రానా సరసన

Published : Oct 03, 2021, 05:16 PM IST
భీమ్లా నాయక్‌ అప్‌డేట్‌ః ఐశ్వర్య ఔట్‌.. సంయుక్త మీనన్‌ ఇన్‌.. రానా సరసన

సారాంశం

పవన్‌ సరసన నిత్యా మీనన్‌ నటిస్తుంది. రానా సరసన ఐశ్వర్య రాజేష్‌ ఎంపికైంది. అయితే ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడటంతో ఐశ్వర్య డేట్స్ క్లాషెస్‌ అయ్యాయి. 

పవన్‌ కళ్యాణ్‌(pawan kalyan), రానా(rana) కలిసి నటిస్తున్న చిత్రం `భీమ్లా నాయక్‌`(bheemla nayak). మలయాళంలో విజయం సాధించిన `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` చిత్రానికి రీమేక్‌గా రూపొందుతుంది. సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ భీమ్లా నాయక్‌ పాత్రలో పవన్‌ కళ్యాణ్‌, డేనియర్‌ శేఖర్‌ పాత్రలో రానా నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఈగో క్లాషెస్‌ వల్ల జరిగే సంఘర్షణ, గొడవ నేపథ్యంలో సాగే చిత్రమిది. పవన్‌ సరసన నిత్యా మీనన్‌ నటిస్తుంది. రానా సరసన ఐశ్వర్య రాజేష్‌ ఎంపికైంది. అయితే ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడటంతో ఐశ్వర్య డేట్స్ క్లాషెస్‌ అయ్యాయి. దీంతో ఆమె స్థానంలో మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్‌ని ఎంపిక చేశారు. 

ఈ విషయాన్ని సంయుక్త తాజాగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. `లీడర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా`భీమ్లా నాయక్` లో రానా సరసన  నటిస్తుండడం నాకు చాలా ఆనందంగా ఉంది. తెలుగులో ఇంతకంటే బ్యూటీఫుల్‌ డెబ్యూ ఏముంటుంది. ఈ సినిమాతో సంక్రాంతి మాసీవ్‌గా మారడం ఖాయం` అని ట్వీట్ చేసింది. 2016లో `పాప్‌కార్న్` చిత్రంతో హీరోయిన్‌గా మారింది సంయుక్త. మలయాళం, తమిళం, కన్నడలో నటిస్తుంది. తాజాగా `భీమ్లానాయక్‌`తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.

 

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

వారణాసి లో మహేష్ బాబు తండ్రి పాత్రను మిస్సైన ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
Illu Illalu Pillalu Today Episode Dec 16: అమూల్య ప్రేమ వేషాలు కళ్లారా చూసిన పెద్దోడు, నాన్నకి చెప్పేందుకు సిద్ధం