టాప్ 10 పాన్ ఇండియా స్టార్స్: ఆర్ ఆర్ ఆర్ హీరోలకు షాక్... బన్నీ రాక్స్! 

Published : Feb 22, 2023, 12:57 PM ISTUpdated : Feb 22, 2023, 01:14 PM IST
టాప్ 10 పాన్ ఇండియా స్టార్స్: ఆర్ ఆర్ ఆర్ హీరోలకు షాక్... బన్నీ రాక్స్! 

సారాంశం

ప్రముఖ బాలీవుడ్ మీడియా టాప్ టెన్ పాన్ ఇండియా స్టార్స్ ర్యాంక్స్ విడుదల చేసింది. తాజా ర్యాంకింగ్స్ లో టాలీవుడ్ నుండి అల్లు అర్జున్ జోరు చూపించగా, ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ క్రిందకు పడిపోయారు.   

దేశం పాన్ ఇండియా ఫీవర్ తో ఊగిపోతోంది. హీరోలు భాషాబేధాలు చెరిపేస్తున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలు ప్రాంతాల మధ్య ఉన్న అడ్డుగోడలు కూల్చేస్తున్నాయి. గత ఏడాది పలువురు హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా అవతరించారు. ఇక టాలీవుడ్ నుండి ప్రభాస్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబలి సిరీస్ తో పాటు సాహో మూవీ ఆయన ఇమేజ్ నార్త్ లో తారా స్థాయికి తీసుకెళ్లింది. పుష్ప మూవీతో అల్లు అర్జున్ ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నారు. 

ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్, ఎన్టీఆర్ సైతం పాన్ ఇండియా హీరోల లీగ్ లో చేరారు. ఇక ఓవరాల్ గా దేశంలోని అన్ని పరిశ్రమల స్టార్స్ నుండి ఎవరు ఎక్కువ ఫేమ్ కలిగి ఉన్నారో అధ్యయనం చేయడం జరిగింది. బాలీవుడ్ ప్రముఖ మీడియా ఆర్మాక్స్ ప్రతి నెల ఒక సర్వే నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ర్యాంక్స్ కేటాయిస్తుంది. 2022కి గాను ఆ సంస్థ సర్వే ప్రకారం... విజయ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, యష్ వరుసగా టాప్ ఫైవ్ పాన్ ఇండియా స్టార్స్ గా నిలిచారు. 

వారి తర్వాత అక్షయ్ కుమార్, రామ్ చరణ్, మహేష్, సూర్య, అజిత్ కుమార్... టాప్ టెన్ లో చోటు సంపాదించారు. అయితే 2023 జనవరి నెల సర్వేలో ఈ ర్యాంక్స్ తారుమారయ్యాయి. అనూహ్యంగా బాలీవుడ్ స్టార్స్ దూసుకువచ్చారు. మెరుగైన ర్యాంక్స్ సొంతం చేసుకున్నారు. ఆర్మాక్స్ సర్వే ప్రకారం టాప్ లో విజయ్ కొనసాగుతున్నాడు. విజయ్ ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా చిత్రం చేయలేదు. అయినా ఆయన ర్యాంక్ చాలా కాలంగా టాప్ 1 లో ఉంది. 

ఇక 2వ ర్యాంక్  అనూహ్యంగా అల్లు అర్జున్ కైవసం చేసుకున్నారు. 2022 సర్వే ఫలితాల్లో ఆయన 4వ ర్యాంక్ లో ఉండగా ప్రభాస్ ని వెనక్కి నెట్టి ముందుకు వెళ్ళాడు. టాప్ 10 లిస్ట్ లో చోటు దక్కని షారుఖ్ ఖాన్ పఠాన్ విజయంతో జెట్ వేగంతో దూసుకు వచ్చారు. ఆయన 3వ ర్యాంక్ దక్కించుకున్నాడు. ప్రభాస్ రెండు ర్యాంక్స్ కోల్పోయి టాప్ 4కి పడిపోయాడు. షాకింగ్ గా అక్షయ్ కుమార్, సూర్య తమ ర్యాంక్స్ మెరుగుపరచుకుని 5,6 ర్యాంక్స్ దక్కించుకున్నారు. 

ఎన్టీఆర్ ఏకంగా నాలుగు ర్యాంక్స్ కోల్పోయి టాప్ 3 నుండి 7కి పడిపోయాడు. ఇది ఊహించని పరిణామం. హీరో అజిత్ కి 8వ ర్యాంక్ దక్కింది. తునివు విడుదల నేపథ్యంలో అజిత్ కూడా తన ర్యాంక్ మెరుగుపరచుకున్నారు. మరో ఆర్ ఆర్ ఆర్ హీరో రామ్ చరణ్ సైతం రెండు ర్యాంక్స్ కోల్పోయి 9వ ర్యాంక్ కి పడిపోయాడు. ఇక చివరి స్థానం కెజిఎఫ్ స్టార్ యష్ కి దక్కింది. టాప్ 5లో ఉన్న యష్ ఐదు ర్యాంక్స్ కోల్పోయి 10కి పడిపోయారు.  

PREV
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు