హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు నేడు సోమవారం విచారణకు హాజరు కావలసి ఉంది.
హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు నేడు సోమవారం విచారణకు హాజరు కావలసి ఉంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట ఆయన హాజరు కావడం పట్ల ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. మహేష్ బాబు నేడే విచారణకి హాజరుతారా ? లేక్ మరో రోజుకు వాయిదా వేసుకుంటారా అనేది చూడాలి.
సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ సంస్థల ఆర్థిక లావాదేవీల్లో భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈడీ చేపట్టిన దర్యాప్తులో ఈ రెండు సంస్థలు అనధికారిక ప్లాట్లను విక్రయించడమే కాకుండా, వాస్తవానికి డెలివర్ చేయాల్సిన ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రజలను మోసగించారని ఈడీ ప్రాథమికంగా గుర్తించింది.
ఈ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన మహేశ్ బాబు, వీరి ప్రాజెక్టుల కోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సేవల కోసం ఆయనకు రూ. 5.9 కోట్లు పారితోషికంగా చెల్లించినట్లు తెలుస్తోంది. ఇందులో రూ. 2.5 కోట్లు నగదుగా చెల్లించారని, ఆ నగదు లావాదేవీలను ఇప్పుడు ఈడీ అనుమానాస్పదంగా పరిగణిస్తోంది.
ఇంతకు ముందు మహేశ్ బాబుకు ఈడీ సమన్లు జారీ చేసింది. మహేష్ బాబు ఏప్రిల్ 28న ఈడీ విచారణకు హాజరు కావలసింది. షూటింగ్ తో బిజీగా ఉండడం వల్ల విచారణకు హాజరు కాలేనని, మరో తేదీ కేటాయించాలని మహేష్ ఈడీని కోరారు. తన వృత్తిపరమైన బాధ్యతల వల్ల తగిన సమయం ఇవ్వాలంటూ మహేశ్ బాబు ఈడీకి విజ్ఞప్తి చేయడంతో ఈడీ ఈరోజు విచారణ ఫిక్స్ చేసింది. అయితే మహేష్ ఈరోజైన విచారణకు హాజరవుతారా లేదో అనేది చూడాలి.
ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు.