Latest Videos

కల్కి వల్ల ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ క్లోజ్ చేసిన విశ్వక్ సేన్....? ఆ విషయంలో భయపడ్డాడా..?

By Mahesh JujjuriFirst Published Jun 30, 2024, 1:50 PM IST
Highlights

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను క్లోజ్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం ఫిల్మ్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఆయన ఆ పనిచేయడానికి కారణం ఏంటి..?

 వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. రీసెంట్ గా ఆయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి  సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కాని ఈసినిమా విశ్వక్ సేన్ ను తీవ్రంగా నిరాశ పరిచింది.  అయితే తన సినిమా ఈవెంట్స్ లో చాలా దూకుడు స్వభావం చూపించే విశ్వక్.. చాలా వివాదాలు కొనితెచ్చుకున్నాడు. కాస్త దురుసుగా ప్రవర్తించడం కారణంగా ఆయన చుట్టు ఎన్నో వివాదాలు నెలకొన్నాయి. ఈక్రమంలో విశ్వక్ సేన్ ఇన్ స్టా అకౌంట్ ను క్లాజ్ చేయడం ఆసక్తి కరంగా మారింది. 

రీసెంట్ గా కల్కి 2898 AD ట్రైలర్‌ విషయంలో ఓ యూట్యూబర్ తో గొడవ పెట్టుకున్నాడు విశ్వక్ సేన్ . ‘ఇండస్ట్రీ అంటే వేలాది కుటుంబాలది. చాలా కుటుంబాలు ఇండస్ట్రీ పై ఆధారపడి బ్రతుకుతున్నాయి. అలాంటి గొప్ప పరిశ్రమ అంటే యూట్యూబర్లకు సరదా అయిపోయింది. సినిమాలపై అభిప్రాయాలు వ్యక్తం చేసే ఇలాంటివారు ఏదైనా షార్ట్‌ ఫిలిమ్‌ తీసి చూపించండి. సినిమా కార్మికుల కష్టాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అంటూ కామెంట్స్ చేశాడు విశ్వక్ సేన్.

ఇద్దరు కూతుళ్ల మధ్య నలిగిపోతున్న బాలకృష్ణ, మోక్షజ్ఞ వల్లే బాలయ్యకు ఈ పరిస్ధితి వచ్చిందా..?

అయితే విశ్వక్ సేన్ నటించిన  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సీనిమాకు  సదరు  యూట్యూబర్ నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. దాంతో అతనిపై కోపంతోనే విశ్వక్ సేన్ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటాడు అని అంతా అనుకుంటున్నారు. ఈ విషయంలో చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా విశ్వక్ సేన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని డిలెట్ చేయడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.  సడన్ గా విశ్వక్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏంటి అని చర్చ స్టార్ట్ అయ్యింది. 

అయితే ఈ యూట్యూబర్ తో గోడవ కారణంగా.. విశ్వక్ పై ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. చాలామందియూట్యూబర్లు విశ్వక్ ను టార్గెట్ చేస్తున్నారు. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దాంతో ఈ ట్రోలింగ్ కు భయపడి  ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటాడని అంటున్నారు. ఇక విశ్వక్ సేన్ వరుస సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. 

రజినీకాంత్ కూతురితో జయం రవి పెళ్ళి..? కొత్త బాంబ్ పేల్చిన సెలబ్రిటీ..

click me!