భారతీయుడు 3 స్టోరీ రివీల్ చేసిన కమల్ హాసన్.. ఊహించని ట్విస్ట్ తో అసలైన స్వాతంత్ర పోరాటం

Published : Jun 29, 2024, 05:52 PM IST
భారతీయుడు 3 స్టోరీ రివీల్ చేసిన కమల్ హాసన్.. ఊహించని ట్విస్ట్ తో అసలైన స్వాతంత్ర పోరాటం

సారాంశం

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 జూలైలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. 28 ఏళ్ళ తర్వాత శంకర్ భారతీయుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ట్రైలర్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయింది.

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 జూలైలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. 28 ఏళ్ళ తర్వాత శంకర్ భారతీయుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ట్రైలర్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయింది. భారతీయుడిగా కమల్ హాసన్ చేసే విన్యాసాలని చూసేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

భారతీయుడు 2 ప్రమోషన్స్ లో భాగంగా కమల్ హాసన్ భారతీయుడు 3 కథ కూడా రివీల్ చేశారు. ఆయన చెప్పిన పాయింట్ దిమ్మతిరిగేలా ఉంది. అదేంటంటే.. భారతీయుడు 3లో మరో కమల్ హాసన్ వస్తాడట. డైరెక్టర్ శంకర్ స్వాతంత్ర ఉద్యమం సమయంలో జరిగిన సంఘటనలని భారతీయుడు 3లో చూపించబోతున్నారు అని కమల్ హాసన్ అన్నారు. 

అసలే 106 ఏళ్ళ సేనాపతి ఆ విధంగా ఫైట్స్ చేస్తే ఎలా నమ్మాలి అని డిబేట్ సాగుతోంది. ఇప్పుడు భారతీయుడు 3లో సేనాపతి తండ్రిని చూపిస్తారట. సేనాపతికి తన తండ్రి నుంచి మర్మ కళ వచ్చింది. సేనాపతి స్వాతంత్ర ఉద్యమం చేసి భారతీయుడిగా మారారు. 

అతడి తండ్రి కూడా స్వాతంత్ర ఉద్యమం చేసినట్లు భారతీయుడు 3లో శంకర్ చూపించబోతున్నారు. కమల్ సేనాపతి తండ్రికి కాజల్ అగర్వాల్ భార్యగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అదన్నమాట సంగతి.. భారతీయుడు 3లో ఇప్పటి టైం లో కాకుండా బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులని చూపిస్తారు. 

PREV
click me!

Recommended Stories

Tollywood Villains: స్క్రీన్ పై వణుకుపుట్టించే విలన్లకు అందమైన భార్యలు, సోనూసూద్ నుంచి షాయాజీ షిండే వరకు
DDLJ: 30 ఏళ్లుగా ఒకే ఒక్క థియేటర్లో నడుస్తున్న సినిమా, 4 కోట్ల బడ్జెట్ పెడితే 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా?