టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ కెమెరామెన్‌ కన్నుమూత

Published : Mar 06, 2023, 08:25 AM IST
టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ కెమెరామెన్‌ కన్నుమూత

సారాంశం

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ ప్రవీణ్‌ అనుమోలు కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు.  

టాలీవుడ్‌ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది కాలంగా దిగ్గజాలు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు. ఇటీవలే తారకరత్న కన్నుమూశారు. ఆ విషాదం నుంచి బయటపడక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. యువ కెమెరామెన్‌ కన్నుమూశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ ప్రవీణ్‌ అనుమోలు హార్ట్ ఎటాక్‌తో కన్నుమూశాడు. ఆయన ఆదివారం గుండెపోటుతో మరణించడంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

2017లో వచ్చిన `దర్శకుడు` చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు ప్రవీణ్‌ అనుమోలు. అంతకు ముందు `బాజీరావు మస్తానీ, `ధూమ్‌3`, `బేబీ`, `పంజా`, `యమదొంగ` చిత్రాలకు ఆయన అసిస్టెంట్‌ కెమెరామెన్‌గా పనిచేశారు. సుకుమార్ డైరెక్ష‌న్ టీమ్‌లో వ‌ర్క్ చేసిన జ‌క్కా హ‌రి ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ద‌ర్శ‌కుడు` సినిమాతో సినిమాటోగ్రాఫ‌ర్‌గా మారారు. అశోక్ బండ్రెడ్డి హీరోగా న‌టించిన ఈ చిత్రంలో ఈషా రెబ్బా హీరోయిన్‌గా న‌టించింది. ఇప్పుడు మ‌రికొన్ని సినిమాలు నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి.  సినిమాటోగ్రాఫర్‌గా బిజీ అవుతున్న నేపథ్యంలో ఆయన హార్ట్ ఎటాక్‌తో హఠాన్మరణం చెందడం అత్యంత విచారకరం. ప్రవీణ్‌ అనుమోలు మృతి పట్ల టాలీవుడ్‌ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. 

ఇటీవల కాలంలో తెలుగులో దిగ్గజ నటులు కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యానారాయణ, చలపతిరావు, దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్‌, ఆయన సతీమణి, అలాగే మహేష్‌ తల్లి ఇందిరాదేవి, సింగర్‌ వాణీ జయరాం కన్నుమూసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇటీవల కాలంలో వరుసగా సెలబ్రిటీలు హార్ట్ ఎటాక్‌తో కన్నుమూయడం అత్యంత విచారకరం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

OTT Movies: ఈ వారం ఓటీటీ రిలీజ్‌⁠లు ఇవే.. సంచలనం సృష్టించిన చిన్న సినిమా, తప్పక చూడాల్సిన థ్రిల్లర్స్ రెడీ
Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే