తీవ్ర విషాదం..టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య, వ్యక్తిగత సమస్యల వల్లేనా!

Published : Jan 23, 2023, 04:17 PM IST
తీవ్ర విషాదం..టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య, వ్యక్తిగత సమస్యల వల్లేనా!

సారాంశం

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు సుధీర్ వర్మ నేడు తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వార్త తెలియగానే అతడి స్నేహితులు, సన్నిహితులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. 

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు సుధీర్ వర్మ నేడు తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వార్త తెలియగానే అతడి స్నేహితులు, సన్నిహితులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. విశాఖ పట్నంలోని తన నివాసంలో సుధీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

సుధీర్ వర్మ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటున్నాడు. సుధీర్ వర్మ కుందనపు బొమ్మ చిత్రంలో ఓ హీరోగా నటించాడు. ఈ చిత్రంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కొమకుల మరో హీరోగా నటించాడు. 

సెకండ్ హ్యాండ్, షూట్ అవుట్ ఎట్ ఆలేరు చిత్రాల్లో సుధీర్ వర్మ మెరిశారు. సుధీర్ ఆత్మహత్యకు కారణం వ్యక్తిగత సమస్యలే అని తెలుస్తోంది. అయితే సుధీర్ సూసైడ్ కి గురించి పూర్తి వివరాలని కుటుంబ సభ్యులు తెలియజేయలేదు. 

సుధీర్ ఆత్మహత్య చేసుకోవడంతో చిత్ర పరిశ్రమలో ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అతడితో కలసి నటించిన సుధాకర్ విషాదంలో మునిగిపోయాడు. 'సుధీర్ నీ మరణ వార్తని జీర్ణించుకోలేకున్నాను. నీతో కలసి నటించడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఓం శాంతి అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?