త్వరలో 'తెలుగు ఇండియన్‌ ఐడల్‌' సీజన్‌ 2 షురూ.. ఆడిషన్స్ నిర్వహిస్తున్న ఆహా!

By team telugu  |  First Published Jan 23, 2023, 2:08 PM IST

బ్లాక్ బాస్టర్ రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ (Telugu Indian Idol) సీజన్ 2 ప్రారంభం  కాబోతోంది. ఇందుకోసం ‘ఆహా’ తగిన ఏర్పాట్లను చేస్తోంది. తాజాగా ఈషోకోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. 
 


గతేడాది ఆహాలో ప్రసారమై బ్లాక్ బాస్టర్ రియాలిటీ షోగా నిలిచిన ‘తెలుగు ఇండియన్ ఐడల్’ను ఆహా కొనసాగించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సీజన్ 2ను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రెండవ సీజన్ ప్రారంభానికి సంబంధించిన టీజర్‌ను కూడా ఇటీవల విడుదల చేసి టీవీ ఆడియెన్స్ ను ఖుషీ చేశారు. త్వరలో  షురూ కానున్న షో కోసం ఆడిషన్స్ కూడా నిర్వహిస్తున్నారు.. ఇప్పటికే ప్రారంభమయ్యాయి.  

తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2 లోనూ తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన గళాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది ఆహా. ఈ షో ఫస్ట్ ఎడిషన్‌కి వచ్చిన అద్భుతమైన, హృద్యమైన స్పందన చూసి, ఈ సెకండ్‌ చాప్టర్‌ని ప్లాన్‌ చేశారు. ఫస్ట్ సీజన్‌ ఇచ్చిన ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా, శ్రావ్యమైన గళాలను ప్రేక్షకులకు పరిచయం చేసేలా, మరింత గ్రాండియర్‌గా రూపొందుతోంది.  భారతదేశపు అతి పెద్ద టాక్‌ షో అన్‌స్టాపబుల్‌2లో ఈ షో గురించి అనౌన్స్ చేశారు నందమూరి బాలకృష్ణ. ఫస్ట్ సీజన్‌లో ఎస్‌ఎస్‌ తమన్‌, నిత్యామీనన్‌, కార్తిక్‌ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. బీవీకే వాగ్దేవి ట్రోఫీ గెలుచుకున్నారు. శ్రీనివాస్‌, వైష్ణవి తొలి రెండు రన్నరప్‌ స్థానాల్లో నిలిచారు. 

Latest Videos

 అయితే, తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న శ్రావ్యమైన గళాలకు అద్భుత వేదికను ఏర్పాటు చేసి, ప్రపంచానికి పరిచయం చేయాలనే సదుద్దేశంతో ఈ షోని ప్లాన్‌ చేసింది ఆహా. 16 నుంచి 30 ఏళ్ల లోపున్నవారు ఈ షోలో పాల్గొనవచ్చు. ఇప్పుడు సీజన్‌ 2 కోసం ఆడిషన్స్ ని నిర్వహిస్తోంది. హైదరాబాద్‌, బషీర్‌బాగ్‌లోని సెయింట్‌ జార్జి గ్రామర్‌ హై స్కూల్లో జనవరి 29న ఈ ఆడిషన్స్ జరగనున్నాయి. ఫిబ్రవరిలో సీజన్ 2ను లాంచ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు. మొదటి షూట్ షెడ్యూల్, స్ట్రీమింగ్ తేదీపై త్వరలో అప్డేట్ అందే అవకాశం ఉంది. 

ఇక Aha అట్టహాసంగా మొదలైనప్పటి నుంచీ తమ ప్రేక్షకుల కోసం ఉత్కంఠభరితమైన, వినోదాత్మకమైన కంటెంట్‌ అందించడం మీద దృష్టి సారిస్తూనే ఉంది. ఆహా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌లో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఒరిజినల్స్, వరల్డ్ డిజిటల్‌ ప్రీమియర్స్, క్లట్టర్‌ బ్రేకింగ్‌ రియాలిటీ షోలు ప్రసారమయ్యాయి. వాటన్నిటికీ అదనంగా, ప్రత్యేక ఆకర్షణగా, వినోదాత్మకంగా ఉండేలా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ రియాలిటీ షోని తీర్చిదిద్దారు.  

సింగిగ్ కళ ని, కల ని, మీలో మీతోనే ఉంచేస్తే ఎలా? మీ టాలెంట్ ప్రపంచానికి తెలిపేందుకు ఒక్క అడుగు వేయండి. తెలుగు ఇండియన్ ఐడల్ మిగతాది మొత్తం చూసుకుంటుంది.
Participate or spread the word, auditions now open. Don't miss this incredible opportunity to rock the singing world! pic.twitter.com/JouAivlvPs

— ahavideoin (@ahavideoIN)
click me!