సీఎం జగన్‌తో ముగిసిన సినీ ప్రముఖుల భేటీ.. చర్చల్లో పాల్గొన్నవారు వీరే..

Published : Feb 10, 2022, 01:20 PM IST
సీఎం జగన్‌తో ముగిసిన సినీ ప్రముఖుల భేటీ.. చర్చల్లో పాల్గొన్నవారు వీరే..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) తో సినీ ప్రముఖులు భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ప్రముఖ నటుడు చిరంజీవి నేతృత్వంలోని పలువురు సినీ నటులు, దర్శకులు, నిర్మాతలు ఈ భేటీలో పాల్గొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) తో సినీ ప్రముఖులు భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ప్రముఖ నటుడు చిరంజీవి నేతృత్వంలోని పలువురు సినీ నటులు, దర్శకులు, నిర్మాతలు ఈ భేటీలో పాల్గొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో సీఎం జగన్‌తో పాటుగా ప్రభుత్వం తరఫున  సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇక, సినీ పరిశ్రమ నుంచి.. చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, నారాయణమూర్తి  ఈ భేటీలో పాల్గొన్నారు. అధికారిక సమావేశం ముగిసిన అనంతరం సీఎం జగన్.. సినీ ప్రముఖులతో చిట్‌ చాట్‌గా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. అనంతరం సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

అంతకుముందు  హీరోలు చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంకు చేరుకున్నారు.

ఈ భేటీకి బయలుదేరడానికి ముందుగా బేగంపేట ఎయిర్ పోర్టులో చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సీఎం‌తో భేటీ తర్వాత అక్కడే మీడియా పాయింట్ వద్ద మాట్లాడనున్నట్టుగా తెలిపారు. టాలీవుడ్ సమస్యలకు ఈరోజుతో శుభం కార్డం పడుతుందని అనుకుంటున్నట్టుగా తెలిపారు. అయితే సీఎం జగన్‌తో భేటీకి తనకు ఆహ్వానం ఉందని ఈ భేటీకి ఎవరెవరో వస్తున్నారో తనకు తెలియదని చిరంజీవి వ్యాఖ్యానించారు. 

సినిమా టికెట్ల ధరను నిర్ణయించడానికి ఇప్పటికే ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సినీ ప్రముఖులు కొందరు గతంలో ఈ కమిటీతో పలు అంశాలపై చర్చించారు. సినిమా టికెట్ల ధరలతో పాటు మరో 17 అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. సినిమా టికెట్ల ధరను నిర్ణయించడానికి ఇప్పటికే ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులు కొందరు గతంలో ఈ కమిటీతో పలు అంశాలపై చర్చించారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి