స్ట్రాంగ్ ఫైట్: తేడా వస్తే F2 కి కష్టమే!

Published : Jan 04, 2019, 06:03 PM IST
స్ట్రాంగ్ ఫైట్: తేడా వస్తే F2 కి కష్టమే!

సారాంశం

2017లో శతమానం భవతి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్స్ ను అందుకోవడం స్టార్ట్ చేసిన దిల్ రాజు 2018లో మాత్రం వరుస అపజయాలతో నష్టాలను చూశాడు. డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఆయన సక్సెస్ అవ్వలేదు.

2017లో శతమానం భవతి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్స్ ను అందుకోవడం స్టార్ట్ చేసిన దిల్ రాజు 2018లో మాత్రం వరుస అపజయాలతో నష్టాలను చూశాడు. డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఆయన సక్సెస్ అవ్వలేదు. గత ఏడాది శ్రీనివాస కళ్యాణం - లవర్ - హలో గురు ప్రేమ కోసమే సినిమాలు పెద్దగా లాభాల్ని అందించలేకపోయాయి. 

ఇక ఈ సంక్రాంతికి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రెడీ అయ్యాడు. F2 - తోడల్లుళ్ల అల్లరిని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ - వరుణ్ తేజ్ సినిమాలో నటించడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే పోటీగా బాలకృష్ణ - రామ్ చరణ్ సినిమాలు స్ట్రాంగ్ గా ఉన్నాయి. 

ఎన్టీఆర్ బయోపిక్ ని ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకర్షించే విధంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తోంది. అలాగే రామ్ చరణ్ కూడా ఇప్పటికే సాంగ్స్ తో యాక్షన్ సీన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాడు. ఈ స్ట్రాంగ్ ఫైట్ లో దిల్ రాజు F2 నిలవాలంటే ఇంకా ప్రమోషన్ డోస్ పెంచాలి. కానీ సినిమా ట్రైలర్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు. ప్రతి ఆడియెన్ ఈ సినిమాకు కామెడీని నమ్ముకొనే వస్తాడు. దాంట్లో తేడా వస్తే మొదటి షోకే F2కి దెబ్బపడినట్లే. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు
Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే