ఈరోజు నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి , అయితే ఈ నాలుగు చిత్రాల్లో ఒకటి కూడా చెప్పుకోతగ్గ సినిమా కాకపోవటం విశేషం. ఉన్నంతలో కాస్త జనాల్లోకి వెళ్లిన సినిమా నయనతార నటించిన ” లేడీ టైగర్ ”. ఈ సినిమాతో పాటుగా నటన , అజయ్ పాసయ్యాడు , రణరంగం చిత్రాలు విడుదల అయ్యాయి .
ఈరోజు నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి , అయితే ఈ నాలుగు చిత్రాల్లో ఒకటి కూడా చెప్పుకోతగ్గ సినిమా కాకపోవటం విశేషం. ఉన్నంతలో కాస్త జనాల్లోకి వెళ్లిన సినిమా నయనతార నటించిన ” లేడీ టైగర్ ”. ఈ సినిమాతో పాటుగా నటన , అజయ్ పాసయ్యాడు , రణరంగం చిత్రాలు విడుదల అయ్యాయి . అయితే ఈ చిత్రాలేవీ ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయాయి. అసలు రిలీజైనట్లు చాలా మందికి తెలీని కూడా తెలియదు. కాకపోతే దియేటర్ లు ఖాళీ ఉన్నాయని , జనవరి 9 నుండి వరుసగా భారీ చిత్రాలు విడుదల అవుతున్నాయని జనవరి 4 ని రిలీజ్ కు ఎంచుకున్నారు.
సుప్రసిద్ధ సినీ పాత్రికేయులు, రచయిత బి.కె.ఈశ్వర్ రచనతో రూపొందిన చిత్రం 'అజయ్ పాసయ్యాడు'. భారతం క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి ప్రేమ్ భగీరద్ దర్శకత్వంలో మాగాపు సూర్య కమల-వై.రాజేంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాని వినోదాత్మక, స్ఫూర్తి భరిత చిత్రంగా ప్రమోట్ చేసారు. కానీ ఫలితం లేదు.
undefined
శ్రీ వీరాంజనేయులు సమర్పణలో కుబేర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత కుబేర ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం “నటన”. నూట ఎనబై కు పైగా విజయవసంతమైన చిత్రాలకు రైటర్ గా పని చేసిన భారతి బాబు ” నటన” చిత్రానికి తొలిసారిగా దర్శకత్వ బాధ్యతను స్వీకరించారు. నా లవ్ స్టొరీ ఫెమ్ మహీదార్ హీరోగా, వానవిల్లు ఫెమ్ శ్రావ్య రావు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరో బానుచందర్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ చిత్రం కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
ఈ రోజు రిలీజ్ కాకపోతే ఇక ఈ నెలలో విడుదల కష్టం..ఎక్కడా కొంచె కూడా దూరే పరిస్దితి లేదు. ఏదో రిలీజ్ అయ్యాయంటే..అయ్యాయి అనిపించుకునేందుకు దియోటర్స్ కు వచ్చాయి. ఇక వీటి రిజల్ట్ విషయానికి వస్తే వేటీలోనూ చెప్పుకోతగ్గ కంటెంట్ లేదు. ఈ సినిమాలన్నీ వచ్చిన దారినే పోయేటట్లు ఉన్నాయి . ఇక జనవరి 9 , 10 , 11 , 12 న వరుసగా నాలుగు రోజుల్లో నాలుగు భారీ చిత్రాలు విడుదల అవుతున్నాయి. వాటి కోసం టాలీవుడ్ ప్రిపేర్ అవుతోంది. వాటిలో రెండు హిట్ అయ్యినా..జనవరి, పిబ్రవరి నెలలు లాగేయచ్చు.