కేరళ విలవిల...టాలీవుడ్‌ విరాళాలు

Published : Aug 19, 2018, 12:09 PM ISTUpdated : Sep 09, 2018, 11:52 AM IST
కేరళ విలవిల...టాలీవుడ్‌ విరాళాలు

సారాంశం

ప్రకృతి ప్రకోపంతో కేరళ అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా ఇప్పటి వరకు 350 మందికిపైగా ప్రాణాలు కొల్పోగా లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకులా వణికిన కేరళను ఆదుకునేందుకు తెలుగు చిత్రపరిశ్రమ ముందుకు వచ్చింది.   

హైదరాబాద్: ప్రకృతి ప్రకోపంతో కేరళ అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా ఇప్పటి వరకు 350 మందికిపైగా ప్రాణాలు కొల్పోగా లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకులా వణికిన కేరళను ఆదుకునేందుకు తెలుగు చిత్రపరిశ్రమ ముందుకు వచ్చింది. 

మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌ చరణ్‌లు కలిసి 50 లక్షలు, మరో 10 లక్షల రూపాయల మందులు అందించేందుకు రామ్ చరణ్ భార్య ఉపాసన ముందుకు వచ్చారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం 25 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. చిరంజీవి తల్లి అంజనాదేవీ లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు.  అల్లు అర్జున్ 25 లక్షలు, అక్కినేని నాగార్జున 28 లక్షలు, యంగ్ హీరో ఎన్టీఆర్‌ 25 లక్షలు, హీరో కళ్యాణ్ రామ్ 10 లక్షలు, యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ 5 లక్షలు, దర్శకుడు కొరటాల శివ 3 లక్షలు తమవంతు సాయంగా ప్రకటించారు. 

వీటితోపాటు గీత గోవిందం చిత్ర నిర్మాత బన్నీ వాసు తమ చిత్రం కేరళ వసూళ్లను సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం ఇస్తున్నట్లు ప్రకటించారు.
అలాగే మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ సైతం తమ విరాళాన్ని ప్రకటించింది. కేరళ ప్రజలకు తమవంతు సాయంగా 10లక్షలు విరాళం ఇవ్వనున్నట్లు మా  అధ్యక్షుడు శివాజీరాజా తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?