పవన్ కి ఇష్టమైన గెటప్.. శ్రీరెడ్డి పోస్ట్ పై ఫ్యాన్స్ ఆగ్రహం!

Published : Aug 19, 2018, 12:03 PM ISTUpdated : Sep 09, 2018, 12:51 PM IST
పవన్ కి ఇష్టమైన గెటప్.. శ్రీరెడ్డి పోస్ట్ పై ఫ్యాన్స్ ఆగ్రహం!

సారాంశం

టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ విషయంలో సంచలన ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి పవన్ కల్యాణ్ ని అతడి తల్లిని దూషిస్తూ మాట్లాడింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆమెని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు

టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ విషయంలో సంచలన ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి పవన్ కల్యాణ్ ని అతడి తల్లిని దూషిస్తూ మాట్లాడింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆమెని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు. రీసెంట్ గా కోలీవుడ్ కి వెళ్లి అక్కడ తారలపై కూడా ఆరోపణలు చేసింది. రాజకీయాల దృష్ట్యా ఇప్పటికీ ఆమె పవన్ ని టార్గెట్ చేస్తూ పోస్ట్ లు పెడుతూనే ఉంది. ఓ పక్క జగన్ ని అన్న అని పిలుస్తూ పవన్ ని మాత్రమే దూషిస్తుండడంపై ఆమె కావాలని ఇలా చేస్తుందనే వార్తలు వినిపించాయి.

అయితే పవన్ ని టార్గెట్ చేసిన ప్రతిసారి ఆయన అభిమానుల ఆగ్రహానికి గురవుతూనే ఉంది. అయినప్పటికీ తన ప్రవర్తన మాత్రం మార్చుకోవడం లేదు. ఈసారి హద్దులు దాటి పవన్ పై ఆమె చేసిన కామెంట్ కి అభిమానులకు మరింత కోపాన్ని తెప్పించింది. 'అత్తారింటికి దారేది' సినిమాలో పవన్ కల్యాణ్ లేడీ గెటప్ లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ పవన్ కల్యాణ్ కి ఇష్టమైన గెటప్ అని పోస్ట్ పెట్టింది.

దీంతో పవన్ అభిమానులు ఓ రేంజ్ లో ఆమెపై మండిపడుతున్నారు. గతంలో కూడా పవన్ వ్యక్తిగత జీవితాన్ని ఎత్తిచూపుతూ 'తెలుగింటి బిడ్డలారా.. ఇతను మనకి అవసరమా' అంటూ పోస్ట్ పెట్టింది.  

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?