మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం, తెలుగు రాష్ట్రాల నుంచి 12 మందికి

By Mahesh JujjuriFirst Published Jan 25, 2023, 10:18 PM IST
Highlights

ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ డైరెక్టర్.. టాలీవుడ్ సీనియర్ మ్యూజిషియన్ కీరవాణిని కేంద్ర ప్రభుత్వ పద్మ అవార్డ్ వరించింది. తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో కీరవాణికి చోటు దక్కింది. 
 

ప్రతీ సంవత్సరం మాదిరిగానే రిపబ్లిక్ డే సందర్భంగా  అత్యున్నత పౌరపురస్కారాలను ప్రకటించిది క్రేంద్ర ప్రభుత్వం. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ అత్యుత్తమ అవార్డ్ లను ప్రకటిస్తారు. ఈక్రమంలో ఈసారి కూడా వివిధ రంగాల నుంచి పద్మా అవార్డ్ లను ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డ్ లిస్ట్ లో ట్రిపుల్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి చోటు దక్కింది. క్రేంద్ర ప్రభుత్వం కీరవాణికి పద్మశ్రీ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి 12 మందికి పద్మ పుర్కారాలు దక్కగా.. అందులో కీరవాణిని పద్మ శ్రీ వరించింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్నజియర్ స్వామికి పద్మ భూషన్ ప్రకటించారు. 

ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ను అందుకున్నారు ఎమ్ ఎమ్ కీరవాణి. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నాటు నాటు సాంగ్ కు గాను ప్రఖ్యాత అవార్డ్ ను అంతర్జాతీయ వేదికపై తీసుకున్నారు కీరవాణి. ఇంత వరకూ ఇండియన్ సినిమా కు సబంధించి ఆ అవార్డ్ ను ఎవరూ అందుకోలేదు. ఇక ప్రస్తుతం నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. ఆస్కార్ సాధిస్తే.. టాలీవుడ్ రేంజ్ మరోపది మెట్లు ఎక్కినట్టే. ఈక్రమంలోనే కీరవాణి ప్రతిభను.. ఆయన సినిమా సంగీతానికి చేసిన సేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. 

ఇక కీరవాణి మనసు మమత సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఎన్నో క్లాసిక్స్ ను అందించిన ఆయన  నాగార్జున హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన అన్నమయ్య  సినిమాకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవడంతో పాటు.. ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు కూడా అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున 11 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. ఇందులో 8 ఉత్తమ సంగీత దర్శకుడిగా అందుకుంటే.. 3  బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్‌గా గౌరవాన్ని కీరవాణి అందుకున్నారు.ఇక త్వరలో ఆస్కార్ కూడా అందుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువగా గొల్డెన్ గ్లోబ్ అవార్డ్ పొందిన వారికే ఆస్కార్ కూడా వరించడం జరుగుతుంది. 

 

click me!