సమంత చేయలేని పని బాలకృష్ణ చేశాడు!

Published : Jan 25, 2023, 06:36 PM ISTUpdated : Jan 25, 2023, 06:42 PM IST
 సమంత చేయలేని పని బాలకృష్ణ చేశాడు!

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య వివాదం నడుస్తుంది. గొడవ అంతకంతకూ పెరుగుతో పోతుంది. అక్కినేని అభిమానులు బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.   

బాలయ్య ఇంటెన్షన్ ఏదైనా కానీ... 'అక్కినేని తొక్కినేని' కామెంట్ వివాదాస్పదమైంది. లెజెండ్  నాగేశ్వరరావుని బాలయ్య అవమానపరిచారంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల అక్కినేని అభిమానులు బాలయ్య దిష్టి బొమ్మలు దగ్ధం చేసి నిరసన తెలిపారు.ఏఎన్నార్ మనవళ్లు అఖిల్, నాగ చైతన్య స్పందించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని కించపరచటం మనల్ని మనం కించపరుచుకోవడమే అంటూ... చాలా హుందాగా చురకలు వేస్తున్నారు. 

రెండు రోజులుగా వివాదం నడుస్తునా బాలయ్య స్పందించింది లేదు. నా ఉద్దేశం అది కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. నాగార్జున సైతం మౌనం వహించారు. బహుశా బాలయ్య తీరు పూర్తిగా తెలియడం వల్లనేమో కానీ ఎలాంటి కామెంట్, సోషల్ మీడియా పోస్ట్ చేయలేదు. ఈ గొడవ అక్కినేని వర్సెస్ నందమూరి ఫ్యాన్ వార్ కి కారణమైంది. వీడియోలు, కామెంట్స్ పోస్ట్ చేస్తూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే ఇక్కడ ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎన్నడూ ఒకరిని ఉద్దేశిస్తూ నెగిటివ్ లేక పాజిటివ్ కామెంట్ చేయని నాగ చైతన్య మొదటిసారి బాలయ్యపై ఇండైరెక్ట్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. తన అసహనం బయటపెట్టారు. చైతూ సోషల్ మీడియాను చాలా అరుదుగా వాడతారు. ఏవో తన సినిమా ప్రమోషన్స్ పోస్ట్స్ మాత్రమే పెడతారు.వ్యక్తులను వ్యవస్థలను ఉద్దేశించి పోస్ట్స్ పెట్టరు. తన అభిప్రాయం తెలియజేస్తూ కామెంట్ చేయడు. 

సమంతతో విడాకులు విషయంలో చైతూ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. సమంత పరోక్షంగా చైతూని ఉద్దేశిస్తూ పలు పోస్ట్స్ పెట్టారు. కొన్ని ఇంటర్వ్యూలో నేరుగా నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయినా చైతూ స్పందించింది లేదు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎఫైర్ వార్తలపై కూడా ఆయన రియాక్ట్ కాలేదు. అలాంటి చైతూలో కూడా చైతన్యం తెచ్చిన ఘనత బాలయ్యకు దక్కింది. మొత్తానికి ఎన్నడూ సోషల్ మీడియాలో విమర్శలు, అసహనంతో కూడిన పోస్ట్స్ పెట్టని చైతన్య తాతకు అవమానం జరిగిందని స్పందించారు. సమంత కూడా తీసుకురాలేని మార్పు బాలయ్య వల్ల సాధ్యమైంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి విలన్ గా రెండు నిమిషాలు మాత్రమే కనిపించిన సినిమా ఏదో తెలుసా?
OTT: ఒకే రాత్రి 3 హ‌త్య‌లు, ఊహ‌కంద‌ని ట్విస్టులు, ప్ర‌తీ సీన్ క్లైమాక్సే.. ఓటీటీలో సూప‌ర్ థ్రిల్ల‌ర్