విశాల్ సాహసం... గుండెలపై ఆ నాయకుడి బొమ్మ పచ్చబొట్టు వేయించుకున్న తమిళ హీరో

Published : Jan 25, 2023, 09:19 PM ISTUpdated : Jan 25, 2023, 09:21 PM IST
విశాల్ సాహసం... గుండెలపై ఆ నాయకుడి బొమ్మ పచ్చబొట్టు వేయించుకున్న తమిళ హీరో

సారాంశం

హీరో విషాల్ ఎవరూ ఊహించని పని చేశారు. రాజకీయాలు,సినిమాల విషయంలో తను అనుకున్నది వెంటనే చేసేసే విశాల్.. ఈసారి కూడా ఓ మహానాయకుడి పచ్చబొట్టు వేయించుకుని షాక్ ఇచ్చాడు.   

దింగత తమిళ దిగ్గజ నటుడు.. మహా నేత..  రాజకీయనేత ఎంజీఆర్ కి విశాల్ ఘనంగా నివాళి అర్పించాడు. ఆయనపై తన  అభిమానాన్ని గొప్పగా చాటుకున్నాడు. దానికోసం పెద్ద సాహసమే చేశాడు విశాల్. ఎమ్జీఆర్ అంటేు తనకు ప్రాణ  అంటూ.. చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చిన విశాల్.. ఈసారి అది నిరూపించుకున్నాడు. తాజాగా ఎంజీఆర్ ఫోటోని తన గుండెల పై టాటూ వేయించుకున్నాడు విశాల్. అందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

విశాల్ చేసే పనులు ఒక్కోసారి అందరిని ఆశ్చర్చానికి గురి చేస్తుంటాయి. తను అనుకున్న పని వెంటనే చేసేయడం అతినికి అలవాటు. అంతే కాదు  సందర్భం కోసం ఎదరుచూడడు విశాల్. అలాటిదే ఈ పని కూడా విశాల్ ఈ టాటూ వేయించుకోవడం ప్రస్తుతం ఎన్నో చర్చలకు దారి తీస్తుంది. గతంలోర ఇలాంటి పనులు చాలా చేశాడు విశాల్. నటి,రాజకీయ నేత, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి  జయలలిత చనిపోయినప్పుడు కూడా  ఆమె నియోజకవర్గం నుంచి సడెన్ గా ఉప ఎన్నికల్లో విశాల్ పోటీ చేదాం అని అనుకోని నామినేషన్ వేశాడు. అయితే అది రిజెక్ట్ అయ్యింది. 

 

అంతే కాదు ఎప్పటికైనా తాను రాజకీయాల్లోకి రావడం ఖాయం అంటూ చెప్పుకొస్తున్నాడు విశాల్. ఈక్రమంలోనే రీసెంట్ గా ఆయన ఆంధ్రా నుంచి బరిలో దిగుతాడు అని రూమర్స్ వినిపించాయి. వైసీపీలో చేరి.. కుప్పం నుంచి ప్రతిపక్షనేత చంద్రబాబుకు పోటీగా దిగబోతున్నాడు అని తెగ ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో విశాల్ క్లారిటీ ఇచ్చాడు. అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేశాడు. 

ఈ మధ్య కాలంలో.. విశాల్ వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ తరుపు నుంచి పోటీ చేయబోతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీకి, ప్రజలకి దగ్గర అయ్యేందుకు విశాల్ ఎంజీఆర్ ఫోటోని టాటూ వేయించుకున్నాడు అంటూ కొంతమంది అభిప్రాయ పడుతున్నారు. కాగా కొంత మంది మాత్రం ఇది ఏదైనా సినిమా కోసం అయ్యి ఉండవచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ టాటూ వెనుక కథ ఏంటో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే. కాగా విశాల్ ప్రస్తుతం మార్క్ ఆంటోనీ, డిటెక్టీవ్ 2 చిత్రాల్లో నటిస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

డ్రింక్ తాగు, పార్టీ చేసుకో.. ప్రొటెక్షన్ మాత్రం మర్చిపోకు.! క్రేజీ హీరోయిన్‌కి తల్లి బోల్డ్ సలహా
2025 Missed Heroines: ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని 8 మంది హీరోయిన్లు, 2026లో వీరిదే హవా