రోడ్డు పక్కన చెత్త ఏరుకుంటున్న టాలీవుడ్ స్టార్ యాంకర్.. కారణం ఇదే..?

Published : Mar 06, 2024, 08:26 AM IST
రోడ్డు పక్కన చెత్త ఏరుకుంటున్న టాలీవుడ్ స్టార్ యాంకర్.. కారణం ఇదే..?

సారాంశం

టాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా వెలుగు వెలిగి.. నటిగా తన ప్రతిభ చూపిన మల్టీ టాలెంటెడ్ స్టార్ ఝాన్సి.  తాజాగా ఆమె రోడ్ సైడ్ చెత్త సేకరిస్తూ కనిపించారు. కారణం ఏంటంటే..?   

అటు యాంకర్ గా.. ఇటు నటిగా.. మల్టీ టాలెంట్ చూపించింది ఝాన్సి. ఎన్నో సినిమాల్లో నటించి.. ఎన్నో కార్యక్రమాలకు హోస్ట్ గా అదరగొట్టింది. సుమ కంటే ముందు నుంచీ యాంకరింగ్ లో ఉన్న ఈ సీనియర్ తార.. ప్రస్తుతం అప్పుడప్పుడు నటిస్తూ.. అప్పుడప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ కు యాంకరింగ్ చేస్తూ గడిపేస్తోంది. ఎక్కువగా తన పర్సనల్ లైఫ్ పై దృష్టి పెట్టింది ఝాన్సీ. తాను గతంలో అనుకున్న కార్యక్రమాలు ఇప్పుడు ఆచరణలో పెడుతోంది. 

ఇక తాను ఏం చేసి... దానికి సబంధించిన అప్ డేట్స్ ను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అందిస్తుంటుంది ఝాన్సీ. మూవీ షూటింగ్ విషయాలు గురించి, లైఫ్ స్టైల్ విషయాలు గురించి నెటిజెన్స్ కి టిప్స్ ఇచ్చేలా పోస్టులు చేస్తూ సోషల్ మీడియాలో ఆడియన్స్ కి దగ్గరగా ఉంటుది. అంతే కాదు తనపై ట్రోల్స్ వచ్చినా.. అంతే ఘాటుగా సమాధానం కూడా చెపుతుంటుది సీనియర్ యాంకర్. ఇక తాజాగా ఆమె పెట్టిన ఓ  పోస్టు వైరల్ అవుతోంది.  ఆ పోస్టులో ఝాన్సీ రోడ్డు పై చెత్త సేకరిస్తూ కనిపించారు. ఈ విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

 

రోడ్డు పక్కన పడేసిన చెత్తని జాగ్రత్తగా సేకరించి తన కారులో తీసుకోని వెళ్లారు. ఆమె అలా ఎందుకు చేశారు అనేది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఇంతకీ ఆమె సేకరించిన చెత్త ఏంటీ..ఏం చేసిందంటే.. అందులో ఎక్కువగా  ఎండిపోయిన అరటి ఆకులు, అలాగే ఎండుగడ్డి. ప్రకృతి నుంచి వచ్చిన ఈ రెండు.. మళ్లీ ఉపయోగించుకోవచ్చ అంటోంది ఝాన్సీ. ఇవి కరిగిపోవల్సిన  వ్యర్థపదార్దాలు కావు. ప్రకృతి నుంచి వచ్చిన ఏ పదార్థం అయినా.. అది నాశనం అయ్యేటప్పుడు కూడా మళ్ళీ అదే ప్రకృతికి సహాయ పడుతుంది అంటుంది ఝాన్సీ

అదే నేచర్ లో ఉన్న  గొప్ప లక్షణం అని కూడా ఆమె వివరించారు. అంతే కాదు ఆమె ప్రస్తుతం ఆ విషయాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తోంది. అందుకోసం ఏమాత్రం ఇబ్బంది ఫీల్ అవ్వకుండా తన  డ్రైవర్ తో కలిసి.. తన కారులో చెత్తను సేకరిస్తూ.. నరకరాల పనులకు దాన్ని వినియోగిస్తోంది. అంతే కాదు.. ఎండి గడ్డిని, ఆకులను కాల్చి బూడిద చేయకండి. అవి మన మట్టికి చాలా ఉపయోగపడతాయి. అవి ప్రకృతి సమతౌల్య సూత్రం” అంటూ పేర్కొన్నారు. ఈ వీడియో మాత్రమే కాదు గతంలో ఆవు పేడని కూడా ప్రకృతి పద్దతిగా ఎలా ఉపయోగించాలి అనేది కూడా తెలియజేస్తూ వీడియోలు పోస్టు చేశారు. ఇక నెటిజన్లు ఝాన్సీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Anasuya : మానసికంగా వేధిస్తున్నారు, మార్ఫింగ్ ఫోటోలతో పరువు తీస్తున్నారు.. 42 మందిపై అనసూయ పరువునష్టం కేసు..
బాలకృష్ణ అలా పిలుస్తారని అస్సలు ఊహించలేదు.. షాకింగ్ నిజాలు చెప్పిన నటుడు