నాన్నకు ప్రేమతో, మహర్షి హిట్టే కానీ.. టాలీవుడ్ పై శంకర్ ఎఫెక్ట్!

By Siva KodatiFirst Published Jun 2, 2019, 12:33 PM IST
Highlights

దర్శకుడు శంకర్ ఏం చేసినా సంచనలమే. ఇండియన్ సినిమాకు భారీ తనం అంటే ఏమిటో నేర్పిన దర్శకుడు శంకర్. అలాంటి దర్శకుడే ప్రస్తుతం పరిస్థితులకు తగ్గాల్సి వస్తోంది. గతంలో శంకర్ చెప్పిందే నిర్మాతలకు వేదం. కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. 

దర్శకుడు శంకర్ ఏం చేసినా సంచనలమే. ఇండియన్ సినిమాకు భారీ తనం అంటే ఏమిటో నేర్పిన దర్శకుడు శంకర్. అలాంటి దర్శకుడే ప్రస్తుతం పరిస్థితులకు తగ్గాల్సి వస్తోంది. గతంలో శంకర్ చెప్పిందే నిర్మాతలకు వేదం. కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. ఇటీవల శంకర్ తెరకెక్కించిన చిత్రాలు సరిగా రాణించలేదు. దానికి కారణం బడ్జెట్ శృతి మించడమే అనే టాక్ వినిపిస్తోంది. 

2.0 చిత్రానికి మితిమీరిన బడ్జెట్ కేటాయించడం వలన నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు. దీనితో శంకర్ దర్శకత్వంలో త్వరలో తెరకెక్కబోయే చిత్రానికి సంబందించి నిర్మాతలు ఓ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఈ చిత్రానికి ఎక్కువ కేటాయించకూడదని, సరైన టైం లో చిత్రాన్ని పూర్తి చేయాలని శంకర్ తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. శంకర్ దీనికి అంగీకారం తెలుపుతూ సంతకం చేశారట. 

ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతల్లో కూడా ఇలాంటి ఆలోచన మొదలైనట్లు తెలుస్తోంది. నిర్మాణ సమయంలో చిత్రానికి బడ్జెట్ ఎక్కువైతే నిర్మాతలే సర్దుకుపోయేవారు. కానీ ఇప్పుడు అలా కాకూడదు. శంకర్ కు, తమిళ నిర్మాతలకు మధ్య జరిగిన ఒప్పందాన్ని టాలీవుడ్ లో కూడా అమలు చేయాలని కొందరు బడా నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నాన్నకు ప్రేమతో, మహర్షి చిత్రాల ప్రస్తావన వారి మధ్య వచ్చిందట. వాస్తవానికి ఈ రెండు చిత్రాలు హిట్టే. కానీ నిర్మాతకు ఎక్కువేల లాభాలు తేల్చిపెట్టలేకపోయాయి. 

దానికి కారణం బడ్జెట్ ఎక్కువ కావడమే అని అంటున్నారు. సినిమా బావుందని టాక్ సొంతం చేసుకుని తీరా నష్టాల బాట పట్టిన చిత్రాలు చాలానే ఉన్నాయి. దీనిని నివారించాలంటే బడ్జెట్ కంట్రోల్ లో ఉంచాలని, అందుకు దర్శకులతో అగ్రిమెంట్ కుదుర్చుకోవడమే మంచిదనే నిర్ణయానికి టాలీవుడ్ నిర్మాతలు వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ బడ్జెట్ మించితే దర్శకుల రెమ్యునరేషన్ కు కోతపెట్టేలా ఒప్పందపత్రం సిద్ధం చేయాలని భావిస్తున్నారు. 

click me!