పరోక్షంగా రేణు దేశాయ్ హాట్ కామెంట్స్!

Siva Kodati |  
Published : Jun 02, 2019, 10:45 AM IST
పరోక్షంగా రేణు దేశాయ్ హాట్ కామెంట్స్!

సారాంశం

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో చర్చనీయాంశంగా మారుతున్నారు. పవన్ నుంచి విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ పూణేలో తన పిల్లలతో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రేణు దేశాయ్ రచయితగా, దర్శకురాలిగా తన సత్తా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో చర్చనీయాంశంగా మారుతున్నారు. పవన్ నుంచి విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ పూణేలో తన పిల్లలతో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రేణు దేశాయ్ రచయితగా, దర్శకురాలిగా తన సత్తా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా రేణు దేశాయ్ కొన్ని కవితలు కూడా రాస్తూ వారిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. 

గతంలో రేణు దేశాయ్ పోస్ట్ చేసిన అనేక కవితలు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించినవి అంటూ అప్పట్లో చర్చ జరిగాయి. తాజాగా రేణు దేశాయ్ చేసిన మరో పోస్ట్ కూడా పవన్ ని ఉద్దేశించే విధంగా ఉందంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 'రెండవసారి పేమించడం సాధ్యమేనా.. మొదటి సారి ప్రేమలో పడ్డప్పుడు వచ్చిన సంతోషం ఇప్పుడు వస్తుందా.. ఒకసారి అద్దంలో ముఖం చూసుకుంటే మీరు ఏం కోల్పోయారో తెలుస్తుంది. 

నిద్రలేని రాత్రులు గడిపేవారికి మాత్రమే వారి ప్రేమ గురించి తెలుస్తుంది అంటూ రేణు దేశాయ్ ఓ కవితలో పేర్కొంది. ఇటీవల రేణు దేశాయ్ నిశ్చితార్థం జరిగింది. త్వరలో వివాహం కూడా చేసుకోబోతోంది. ఇలాంటి తరుణంలో రేణు దేశాయ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Kokkoroko మూవీతో అలరించేందుకు వస్తోన్న యంగ్‌ సెన్సేషన్‌.. కొత్త పోస్టర్‌ అదిరింది
Dhoolpet Police Station Review: `ధూల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌` కేస్‌ 1 వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. చూపు తిప్పుకోలేరు