మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్ ఇదే.. మరోసారి అభిమానులకు పండగే!

Siva Kodati |  
Published : Jun 02, 2019, 10:12 AM IST
మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్ ఇదే.. మరోసారి అభిమానులకు పండగే!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో అదరగొడుతున్నారు. రాజకీయాలు వదలిపెట్టి ఖైదీ నెం 150 చిత్రంలో చిరంజీవి రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చిరు తన కెరీర్ లోనే భారీ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. మెగాస్టార్ ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో అదరగొడుతున్నారు. రాజకీయాలు వదలిపెట్టి ఖైదీ నెం 150 చిత్రంలో చిరంజీవి రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చిరు తన కెరీర్ లోనే భారీ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. మెగాస్టార్ ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒక రకంగా చిరుకు ఇది ఛాలెంజింగ్ మూవీ. స్వాతంత్ర ఉద్యమ నేపథ్యం ఉన్న కథలో నటించడం చిరుకు ఇదే తొలిసారి..  పైగా 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఇదిలా ఉండగా చిరంజీవి నుంచి త్వరలో మరో ఆసక్తికర చిత్రం ప్రారంభం కాబోతోంది. కొరటాల శివ త్వరలో చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి చిరంజీవి పుట్టినరోజు సంధర్భంగా ఆగష్టు 22న ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్లుగా అనుష్క, శృతి హాసన్ లాంటి నటీమణుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి డ్యూయెల్ రోల్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ అభిమానులకు ఇది మరోమారు పండుగ లాంటి వార్తే. 

కొరటాల శివ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి ఉగాది కానుకగా చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి. 

PREV
click me!

Recommended Stories

100 సినిమాల్లో 44 ప్లాప్ లు, 30 మూవీస్ రిలీజ్ అవ్వలేదు, అయినా సరే ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?