టాలీవుడ్ నిర్మాత కూతురికి కట్నం వేధింపులు!

Published : Feb 15, 2019, 04:22 PM IST
టాలీవుడ్ నిర్మాత కూతురికి కట్నం వేధింపులు!

సారాంశం

అదనపు కట్న వేధింపులు పేద, మధ్యతరగతి కుటుంబాలకు మాత్రమే పరిమితం కాలేదు.. సంపన్న కుటుంబాలకు చెందిన వారు కూడా ఇటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. 

అదనపు కట్న వేధింపులు పేద, మధ్యతరగతి కుటుంబాలకు మాత్రమే పరిమితం కాలేదు.. సంపన్న కుటుంబాలకు చెందిన వారు కూడా ఇటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. టాలీవుడ్ నిర్మాత కట్టా రాంబాబు కుమార్తె అదనపు కట్నం వేధింపులు ఎదుర్కోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్ కి చెందిన కట్టా రాంబాబు తెలుగులో 'కుర్రాడు', 'అనగనగా' వంటి చిత్రాలను నిర్మించారు. ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు. వీరిలో ఒకరైన రమ్యని హోసూరులో నివాసముంటున్న ఆడిటర్ కృష్ణారావు కుమారుడు రాకేశ్ చౌదరికి ఇచ్చి వివాహం జరిపించారు.

2013లో వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. పెళ్లి సమయంలో కట్టా రాంబాబు రూ.4 కోట్లను కట్నంగా ఇచ్చారు. పెళ్లైన తరువాత రమ్య తన భర్తతో కలిసి మూడేళ్లు హోసూరులో ఉంది. ఆ తరువాత ఈ జంట బెంగుళూరుకి షిఫ్ట్ అయింది.

ఈ నేపధ్యంలో గత కొన్నినెలలుగా మరో రూ.5 కోట్లను కట్నంగా తీసుకురావాలని రమ్య భర్త, అతడి తండ్రి వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఆమె హోసూరు మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

Top 5 OTT Movies: ఓటీటీలో టాప్ 5 రీసెంట్ బెస్ట్ మూవీస్.. ఆ ఒక్క మూవీని భార్య భర్తలు అస్సలు మిస్ కాకండి
సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?