మోహన్ బాబుపై లక్ష్మీపార్వతి కామెంట్స్!

Published : Feb 15, 2019, 03:52 PM IST
మోహన్ బాబుపై లక్ష్మీపార్వతి కామెంట్స్!

సారాంశం

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. 

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు వర్మకి తన శుభాకాంక్షలు తెలియజేసింది లక్ష్మీపార్వతి.

ఈ సినిమా ద్వారా వర్మ నిజాలు చెప్పబోతున్నాడంటూ ప్రశంసలు కురిపించింది. సినిమా ట్రైలర్ లో ఓ సన్నివేశంలో మోహన్ బాబు పాత్రని కూడా చూపించారు. దీంతో మోహన్ బాబుకి సంబంధించిన ప్రశ్న లక్ష్మీపార్వతికి ఎదురుకాగా.. ఎన్టీఆర్ కి వెన్నుపోటు జరిగిన సమయంలో మోహన్ బాబు కుడా ఎన్టీఆర్ ని వదిలేసి చంద్రబాబుతో కలిసిపోయాడని ఆరోపణలు చేసింది.

ఆ కారణంగానే మోహన్ బాబుని విమర్శించానని తెలిపింది. ఆ తరువాత తప్పు తెలుసుకొని అన్నగారికి అన్యాయం చేశానని క్షమాపణలు చెప్పినట్లు గుర్తుచేసుకుంది. ఆ తరువాత అతడి కామెంట్ చేయడం సరికాదని వెల్లడించింది.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి ఇంత రెస్పాన్స్ వస్తోందంటే జనాలు నిజంవైపు ఉన్నారని ఆమె చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా