టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత ఎం రామకృష్ణారెడ్డి కన్నుమూత..

Published : May 26, 2022, 08:37 AM IST
టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత ఎం రామకృష్ణారెడ్డి కన్నుమూత..

సారాంశం

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. `అభిమానవంతులు` వంటి పలు విజయవంతమైన సినిమాలు నిర్మించిన ఎం రామకృష్ణారెడ్డి కన్నమూశారు.

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత ఎం రామకృష్ణారెడ్డి(76) (Producer M Ramakrishna Reddy)కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆయన చెన్నైలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. `అభిమానవంతులు`, `వైకుంఠపాళి`, `అల్లుడుగారు జిందాబాద్‌`, `మూడిళ్ల ముచ్చట`, `మాయగాడు`, `సీతాపతి`, అగ్ని కెరటాలు` వంటి చిత్రాలను నిర్మించి అగ్ర నిర్మాతగా ఎదిగారు. తాజాగా ఆయన హఠాన్మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. 

1948 మార్చి 8న నెల్లూరు జిల్లా గూడురులో జన్మించారు నిర్మాత ఎం రామకృష్ణారెడ్డి. శ్రీమతి మస్తానమ్మ, ఎం.సుబ్బరామరెడ్డి ఆయన పేరెంట్స్. మైసూర్‌ యూనివర్సిటీలో బీ ఈ పూర్తి చేసిన తర్వాత కొంత కాలం ఆయన సిమెంట్‌ రేకుల వ్యాపారం చేశారు. ఆ తర్వాత తన బంధువైన ఎం ఎస్‌రెడ్డి సహకారంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1973లో శోభానాయుడు, ఫటాఫట్‌ జయలక్ష్మిలను పరిచయం చేస్తూ `అభిమానవంతులు` చిత్రాన్ని నిర్మించారు.దీనికి కేఎస్‌ రామిరెడ్డి దర్శకులు. ఈచిత్రం మంచి ఆదరణ పొందింది. 

దీంతో ఆయన నిర్మాతగా వరుసగా సినిమాలు చేయడం ప్రారంభించారు.`అభిమానవంతులు` తర్వాత `వైకుంఠపాళి`, `గడుసుపిల్లోడు`, `సీతాపతి సంసారం`, `మావూరి దేవత`, `అల్లుడుగారు జిందాబాద్‌`, `అగ్ని కెరటాలు` చిత్రాలను నిర్మించారు. వాకాడ అప్పారావుతో కలిసి ఆయన `మూడిళ్ల ముచ్చట` సినిమా చేయడం విశేషం. మరోవైపు `అమ్మోరు తల్లి` సినిమాని డబ్ చేశారు. ఎం. రామకృష్ణారెడ్డికి ఇద్దరు కుమారులున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?
Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్