Save Soil: సద్గురు ప్రయాణానికి పాటైన సింగర్‌ మంగ్లీ.. `ధరణి` పాట వైరల్‌

By Aithagoni RajuFirst Published May 25, 2022, 7:20 PM IST
Highlights

`సేవ్‌ సాయిల్‌` కోసం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు 30వేల కిలోమీటర్ల ప్రయాణం చేయబోతున్న నేపథ్యంలో ఆయనకు పాటతో సపోర్ట్ గా నిలిచింది సింగర్‌ మంగ్లీ.

`సేవ్‌ సాయిల్‌` పేరుతో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవన్‌ గొప్ప కార్యక్రమం ప్రారంభించారు. 65ఏళ్ల వయసులోనూ ఆయన 30వేల కిలోమీటర్ల ప్రయాణం చేపట్టబోతున్నారు. `మట్టి ఇసుకగా మారొద్దనే` సంకల్పంతో ప్రజల్లో మట్టి గొప్పతనాన్ని, మట్టి ప్రాధాన్యతని తెలియజేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు సింగర్‌ మంగ్లీ ఈ కార్యక్రమంలో తను భాగమైంది. 

మంగ్లీ తన గొంతుతో `సేవ్‌ సాయిల్‌` కార్యక్రమంలో పాలుపంచుకుంటుంది. తనదైన స్టయిల్‌లో పాట రూపంలో జనంలో అవగాహన కల్పించడంతోపాటు మట్టి గొప్పతనాన్ని చాటి చెబుతుంది. `ధరణి` పేరుతో మంగ్లీ పాట పాడగా, అది ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది.  దండాలమ్మా.. అమ్మా మా నేలమ్మా`అంటూ సాగే ఈ పాట తిరుపతి మట్ల రాయగా, మంగ్లీ ఆలపించారు. మదీన్‌ ఎస్‌కే సంగీతం సమకూర్చారు. తిరుపతి కెమెరామెన్‌గా పనిచేశారు. దాము రెడ్డి డైరెక్షన్‌ చేశారు.ఇందులో తన చెల్లి ఇంద్రావతి చౌహాన్‌తో కలిసి మంగ్లీ స్టెప్పులేయడం విశేషం. 

ఇక మట్టి గొప్పతనాన్ని, మట్టిపరిమళాలను వర్ణిస్తూ మంగ్లీ పాడిన పాట హృదయాలను హత్తుకునేలా ఉంది. వినసొంపుగా ఉండటంతోపాటు ఆలోచింప చేస్తుంది. `సేవ్‌ సాయిల్‌` పేరుతో ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సద్గురు చేస్తున్న ఈ కార్యక్రమానికి మంగ్లీ తన పాటతో మరింత ఊతమిచ్చినట్టయ్యింది. తెలుగు ప్రజలకు మరింత దగ్గర చేసినట్టవుతుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. 

click me!