కరోనా టీకా తీసుకున్న కీర్తి సురేష్!

Published : May 23, 2021, 04:13 PM IST
కరోనా టీకా తీసుకున్న కీర్తి సురేష్!

సారాంశం

హీరోయిన్ కీర్తి సురేష్ కోవిడ్ వాక్సిన్ తీసుకున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆమె కోవిడ్ టీకా తీసుకోవడం జరిగింది. టీకా వేయించుకుంటున్న ఫోటో కీర్తి సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతుంది.   


కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరింత కఠిన పరిస్థితులను పరిచయం చేసింది. వేగంగా వ్యాపిస్తున్న వైరస్ రోజుకు వేలల్లో ప్రాణాలు బలితీసుకుంటుంది. గత రెండు నెలలుగా కరోనా వైరస్ సోకి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు పదుల సంఖ్యలో ప్రాణాలు విడిచారు. తరచుగా కరోనా మరణ వార్తలు వినడం బాధాకరం. 

దీనితో ముందు జాగ్రత్తగా సినీ ప్రముఖులు కోవిడ్ వాక్సిన్ తీసుకుంటున్నారు. కరోనా వైరస్ నుండి తమను తాము రక్షించుకోవడం కోసం వాక్సిన్ తీసుకోవడం జరుగుతుంది. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ కోవిడ్ వాక్సిన్ తీసుకున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆమె కోవిడ్ టీకా తీసుకోవడం జరిగింది. టీకా వేయించుకుంటున్న ఫోటో కీర్తి సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతుంది. 


ఇక ఫుల్ ఫార్మ్ లో ఉన్న కీర్తి సురేష్ అన్ని ప్రధాన భాషల్లో సినిమాలు చేస్తున్నారు. అరడజనుకు పైగా చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. మహేష్ హీరోగా దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట మూవీలో కీర్తి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సర్కారు వారి పాట షూటింగ్ మొదలు కాగా, 2022 సంక్రాంతి కానుకగా విడుదల తేదీగా ప్రకటించారు. ఈ మూవీపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. సర్కారు వారి పాట చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Virosh Wedding: పెళ్లి తర్వాత తొలిసారి జంటగా విజయ్-రష్మిక..కొత్త జంట సందడి, వైరల్ ఫోటోస్
Vijay Divorce: అవసరమైన ఆ హీరోయిన్ పేరు బయటపెడతా, అప్పటి నుంచే నాకు మానసిక వేదన.. సంగీత సంచలన వ్యాఖ్యలు