సినీ ప్రొడక్షన్‌ మహిళలకు హాస్యనటుడు అలీ కుటుంబ సమేతంగా సహాయం...

Published : May 23, 2021, 04:35 PM IST
సినీ ప్రొడక్షన్‌ మహిళలకు హాస్యనటుడు అలీ కుటుంబ సమేతంగా సహాయం...

సారాంశం

ప్రముఖ హాస్య నటుడు అలీ, జుబేదా దంపతులు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని తెలుగు సినిమా ఉమెన్‌ ప్రొడక్షన్‌ యూనియన్‌కు సంబంధించిన 130 మందికి నిత్యావసరాలను అందించారు.

ప్రముఖ హాస్య నటుడు అలీ, జుబేదా దంపతులు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని తెలుగు సినిమా ఉమెన్‌ ప్రొడక్షన్‌ యూనియన్‌కు సంబంధించిన 130 మందికి నిత్యావసరాలను అందించారు. తెలుగు సినిమా పరిశ్రమలోని 24 శాఖల్లోని సభ్యులందరూ కరోనా కారణంగా  షూటింగ్‌లు లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారిని ఎంతో కొంత ఆదుకునే ఉద్ధేశ్యంతో అలీ ముందుకు వచ్చి పదికిలోల బియ్యం, నూనె, గోదుమపిండి, చక్కెరలతో పాటు 8 రకాలైన సరుకులను వారికి అందించారు. 

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ, `ప్రతిరోజూ మేము షూటింగ్‌లకు వెళ్లే ముందే ఈ ప్రొడక్షన్‌ యూనియన్‌లోని ఆడవాళ్లు చాలా ముందుగా షూటింగ్‌ స్పాట్‌లకు వెళతారు. ఆ తర్వాత వీళ్లు షూటింగ్‌లో పనిచేసే అందరు తిన్న ప్లేట్లను, కాఫీ కప్పులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారు. ఈ కష్ట సమయంలో  షూటింగ్‌లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలిసింది. అందుకే ఈ రోజు నేను దాదాపు 2లక్షల రూపాయల ఖర్చుతో ఈ సాయం చేయాలని నిర్ణయించుకున్నా` అని అలీ అన్నారు. ఈ కార్యక్రమంలో అలీ సోదరుడు, నటుడు ఖయ్యూం, కరీమ్‌లు పాల్గొన్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Chiranjeeviకి ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసిన కృష్ణంరాజు.. మెగాస్టార్‌ మర్చిపోలేని బర్త్ డే