Hi Nanna: కన్నడ సూపర్ స్టార్ తో టాలీవుడ్ నేచురల్ స్టార్, శివన్న నాని బ్రేక్ ఫాస్ట్ మీట్..

Published : Dec 06, 2023, 11:57 AM IST
Hi Nanna: కన్నడ సూపర్ స్టార్ తో టాలీవుడ్ నేచురల్ స్టార్, శివన్న నాని బ్రేక్ ఫాస్ట్ మీట్..

సారాంశం

హాయ్ నాన్న సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈమూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబతున్నారు. ఈక్రమంలో ప్రమోషన్స్ కోసం అంతట పర్యటనలు చేస్తున్న నేచురల్ స్టార్.. తాజాగా బెంగళూరు లో సందడి చేశారు.  

టాలీవుడ్ నేచురల్‌ నాని, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా  హాయ్ నాన్న.  ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ అవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 5 భాషల్లో భారీగా  విడుదలవుతోంది హాయ్ నాన్న. ఇక ఈ సినిమా ప్రమోషన్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు హీరో నాని. పాన్‌ ఇండియా రిలీజ్‌ కావడంతో పలు నగరాలు చుట్టేస్తున్నాడు.
ఇప్పటికే ఆంధ్రాలో విజయవాడ, కడప, తిరుపతి నగరాలు చుట్టేశాడు. కడప దర్గాలో పూజలు.. తిరుమల దర్శనాలు అయిపోయాయి. ఇక అటు నుంచి అటు బెంగళూరులో సందడిచేశారు నాని. 

మంగళవారం బెంగుళూరులో 'హాయ్ నాన్న మీడియా మీట్ ను నిర్వహించారు. అయితే ఈ సమావేశం కంటే ముందే కన్నడ సూపర్‌ స్టార్ శివ రాజ్‌కుమార్‌ను కలిశాడు నాని. ఈ సందర్భంగా 'హాయ్ నాన్న  సినిమా గురించి నాని, శివన్న మాట్లాడుకున్నారు. నాని సినిమాకు శివరాజ్‌కుమార్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతే కాదు ఇద్దరు స్టార్లు కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం గీతా శివరాజ్‌కుమార్, శివరాజ్‌కుమార్ తో పాటు  నానితో కలిసి ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

హాయ్ నాన్న సినిమాతో కొత్త దర్శకుడు శౌర్యువ్ ను పరిచయం చేస్తున్నాడు నాని. ఇక ఈ సినిమాలో  నాని కూతురు పాత్రలో కియారా ఖన్నా నటించారు. జయరాం, ప్రియదర్శి, అంగద్‌ బేడీ, విరాజ్ అశ్విన్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన పాటలు అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించాయి. నాని తన 30వ సినిమాగా హాయ్ నాన్నను చేశారు. తన 31వ సినిమాగా సరిపోదా శనివారం’ అనే సినిమాలో నటిస్తున్నారు.  వివేక్ ఆత్రేయ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందు వీరి కాంబోలో అంటే సుందరానికి మూవీ వచ్చింది. సూపర్ హిట్ కాకపోయినా.. నాని అభిమానులను అలరించింది సినిమా. హిలేరియస్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా నిలిచింది. అయితే ఆసారి మాత్రం వీరికాంబోలో మాస్ ఎంటర్టైనర్ ని సిద్ధం చేస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య విలన్ గా నటిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Highest Remuneration: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్ల పారితోషికాలు.. అత్యధికంగా తీసుకునేది ఎవరంటే?
బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్