వివేక్ ఆత్రేయ సినిమాతో పాటుగా దీన్ని కూడా సమాంతరంగా పూర్తి చేయాలని నాని భావించారు. అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని కాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది.
నాని ఇప్పుడు తన కెరీర్ లో ఓ స్దాయికి వచ్చి తనకంటూ ఓ స్లాట్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో తన నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. 'దసరా' సినిమాతో నేచురల్ స్టార్ నాని తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. హిట్టు కొట్టిన జోష్ లో ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ప్రస్తుతం శౌర్యువ్ అనే కొత్త డైరెక్టర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ,హాయ్ నాన్నా సినిమా చేసాడు. ఈ వారంలోనే రిలీజ్ అయ్యే ఈ సినిమా ప్రమోషన్స్ ఓరేంజిలో చేస్తున్నాడు. అయితే ఆ సినిమాకు అనుకున్న స్దాయిలో బజ్ రావటం లేదు. తనను పూర్తి యాక్షన్ మోడ్ లో చూసిన జనం ఇప్పుడు ఇలా ఫ్యామిలీ డ్రామాలో అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు..ఓపినింగ్స్ ఎలా వస్తాయనే భయం ఉంది. దాంతో తను నెక్ట్స్ సినిమాలను యాక్షన్ సినిమాలే చేయాలని డిసైడ్ అయ్యినట్లు తెలుస్తోంది.
హాయ్ నాన్న’ సెట్స్‌పై ఉండగానే మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఓ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తారు. ‘సరిపోదా శనివారం’ టైటిల్ తో రూపొందే ఈ చిత్రానికి డివివి.దానయ్య నిర్మాత. ‘హాయ్ నాన్న’ రిలీజ్ తరవాత సెట్స్‌పైకి వేళ్లే చిత్రమిది. మరోవైపు తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి చెప్పిన కథకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తారు. వివేక్ ఆత్రేయ సినిమాతో పాటుగా దీన్ని కూడా సమాంతరంగా పూర్తి చేయాలని నాని భావించారు. అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని కాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఫన్ ఎంటర్టైనర్ చేయటం కన్నా ఏదన్నా యాక్షన్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఎలాగూ 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ తో సినిమా ఉందనే విషయం తెలిసిందే.
ఇక శివ కార్తికేయన్ తో కలిసి 'కాలేజ్ డాన్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన శిబి చక్రవర్తి.. ఇంత వరకూ తన నెక్స్ట్ చిత్రాన్ని అనౌన్స్ చేయలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఓ మూవీ చేయనున్నారని, లైకా ప్రొడక్షన్ లో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ దీని గురించి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. అయితే ఇప్పుడు నానితో సినిమా కోసం శిబి ప్రాజెక్టు కాన్సిల్ అయ్యిన్నట్లు టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.
మరోవైపు నాని సొంత నిర్మాణ సంస్థ ‘వాల్ పోస్టర్’ బ్యానర్‌పై నిర్మించే చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్టు టాక్. పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడవుతాయి.