మెగాస్టార్ అనసూయకు సైడిచ్చాడా.. ఏమో..

Published : Feb 25, 2017, 11:37 AM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
మెగాస్టార్ అనసూయకు సైడిచ్చాడా.. ఏమో..

సారాంశం

మా మీలో ఎవరు కోటీశ్వరుడు షోను హోస్ట్ చేస్తున్న చిరంజీవి మెగాస్టార్ షో కన్నా రేటింగ్స్ ఎక్కువ సాధించిన అనసూయ జాక్ పాట్

స్టార్ మా లాంచ్ ప్రోగ్రామ్ గా పిలవబడుతున్న చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు టీఆర్ పీ రేటింగ్స్ అనుకున్నంతగా లేవా.. అంటే అవుననే సమాధానం చెప్తున్నాయి రేటింగ్స్ ఇచ్చే సంస్థ మీటర్ రీడింగులు. గతంలో మాటీవీ కోసం నాగార్జున చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు నాల్గవ సీజన్ చిరంజీవి టేకప్ చేశారు.

 

ఈ షోను మెగాస్టార్ తనదైన శైలిలో హోస్ట్ చేస్తూ విమర్శకుల ప్రసంశలు అందుకున్నారు. అయితే టీఆర్పీ రేటింగ్స్ వచ్చేసరికి యావరేజ్ రేంజ్ 5.80తో అంతకన్నా ఎక్కువ రేటింగ్ తెచ్చుకున్న ప్రోగ్రామ్స్ కూడా ఉండేసరికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్లలో మొదటి రెండు టాప్ ఛానెళ్లలో ఒకటైన మాటీవీ ఈ షోతో రేటింగ్ పాయింట్లు 10కి పెంచుకుంటుందని స్టార్ మా అంచనా వేసింది. చిరంజీవి ఇచీవలే రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబర్ 150తో తన స్టామినా చాటినా... టీవీ షోకి వచ్చే సరికి ఆ లెక్కలు కాస్త తారుమారయ్యాయి.

 

యండమూరి వీరేంద్రనాథ్ వంటి విమర్శకులు అన్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేస్తున్న మా మీలో ఎవరు కోటీశ్వరుడులో సహజ సిద్ధంగా ఉండటం కంటే... కాస్త డ్రామా ఎక్కువైందా... అందుకే రేటింగ్స్ పై ప్రభావం పడిందా అనే కోణంలో విశ్లేషించుకోవాల్సిన అవసరముంది.

 

ఇక యాంకర్ అనసూయ షో జాక్ పాట్ సమకాలిక రేటింగ్స్ లో 6.5 పాయింట్లు సాధించింది. మరి వెండి తెరపై మెగా స్టార్... టీవీ స్క్రీన్ పై అనసూయకు సైడిచ్చాడా.. ఏమో..

 

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు