మెగాస్టార్ చిరంజీవి దంపతుల కన్నీరు

Published : Feb 25, 2017, 11:13 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
మెగాస్టార్ చిరంజీవి దంపతుల కన్నీరు

సారాంశం

ప్రముఖ నిర్మాత శేఖర్ బాబు మృతి పట్ల పలువురు సినీ పెద్దల నివాళి ముఠామేస్త్రి, సంసార బంధం, మమత, సర్దార్ వంటి సినిమాలు నిర్మించిన శేఖర్ బాబు గుండె పోటుతో నిన్న రాత్రి కన్ను మూసిన శేఖర్ బాబు

ప్రముఖ సినీ నిర్మాత కేసీ శేఖ‌ర్ బాబు హాఠన్మారణంతో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూత నిర్మాత కేసీ శేఖ‌ర్ బాబు (71) శుక్ర‌వారం రాత్రి హైదరాబాద్‌ జర్నలిస్టు కాలనీలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని సినీ ప్రముఖులు షాక్ గురయ్యారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

శేఖర్ బాబు పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం ఉద్వేగానికి గురైన మెగాస్టార్ చిరంజీవి దంపతులు శోకసంద్రంలో మునిగిన శేఖర్ బాబు కుటుంబ సభ్యులను ఓదార్చారు. శేఖర్ బాబు మృతదేహాన్ని చూసి చిరంజీవి దంపతులు కంటతడి పెట్టారు.

 

అగ్రనటులు కృష్ణ, చిరంజీవితో చిత్రాలు నిర్మాత శేఖర్ బాబు కృష్ణ -జ‌మున కాంబినేష‌న్ లో `మమత`, అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ త‌ర్వాత కృష్ణతో `స‌ర్దార్` అనే చిత్రాన్ని నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవితో `ముఠామేస్త్రీ` నిర్మించి భారీ హిట్ ను సొంతం చేసుకొన్నారు. ఆయన నిర్మించిన చిత్రాల్లో `సంసారబంధం`, `గోపాలరావుగారి అమ్మాయి`, `పక్కింటి అమ్మాయి` ఉన్నాయి.

 

తెలుగు, దక్షిణాది సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ధికి కూడా శేఖర్ బాబు విశేష సేవ‌లందించారు. ఫిలిం సెంట్ర‌ల్ బోర్డ్ చైర్మ‌న్ గా, ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ సెక్ర‌ట‌రీగా గా ఆయ‌న ప‌నిచేశారు. ప్ర‌స్తుతం ద‌క్షిణాది ఫిలించాంబ‌ర్ క‌మిటీ మెంబ‌ర్ గా సేవ‌లందిస్తున్నారు. ఇంత‌లోనే ఆయ‌న హాఠాన్మ‌ర‌ణం టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌ని క‌ల‌చి వేసింది. శేఖర్‌బాబు మృతిపట్ల పలువురు సినీ నటులు, ప్రముఖులు సంతాపం తెలిపారు.

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు