క్రేజీ న్యూస్... పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విశ్వక్ సేన్.. ? క్లారిటీ ఇచ్చిన పూరీ టీమ్

Published : Apr 20, 2023, 05:00 PM IST
క్రేజీ న్యూస్... పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విశ్వక్ సేన్.. ? క్లారిటీ ఇచ్చిన పూరీ టీమ్

సారాంశం

విశ్వక్‌ సేన్ కు దర్శకుడు పూరి జగన్నాథ్‌ అవకాశం ఇచ్చినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూరీ దూకుడుగురించి అందరికి తెలిసిందే.. అటువంటి దర్శకుడి చేతిలో విశ్వక్ పడితే.. మాస్ కా దాస్ కి తాతలాంటిసినిమా బయటకు వస్తుంది.   

టాలీవుడ్ యంగ్ హీరోలలో మంచి దూకుడు మీద ఉన్న హీరో ఎవరు అంటే.. వెంటనే విశ్వక్ సేన్ పేరు చెపుతారు ఎవరైనా..? గెలుపు ఓటమీ అంటూ చూడకుండా... దూకుడు మీద ఉన్నాడు విశ్వక్. ప్లాప్ సినిమా అయినా.. అది గుర్తుండిపోయేలా చేస్తాడు విశ్వక్.  ఓ వైపు నటుడిగా మరో వైపు దర్శకుడిగా విశ్వక్‌ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. ఈ మధ్యే ఆయన నటిస్తూ, దర్శకత్వం వహించిన దాస్‌ కా ధమ్‌కీ రిలీజ్ అయ్యింది.  సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకుంటే.. ఫస్డ్ డే నుంచే మిక్స్డ్ టాక్  తెచ్చుకుంది. . తొలిరోజే ఈ సినిమాకు మిక్స్డ్‌ టాక్‌ వచ్చింది. అయితే పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలేవి లేకపోవడంతో వారం వరకు బాగానే లాక్కొచ్చింది. 

ఇక రీసెంట్ గా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఎక్కిన ఈసినిమా.. బుల్లితెరపై కూడా కాస్తో కూస్తో హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక విశ్వక్ సేన్ మరోమూడు సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ సలహా మేరకు డైరెక్టర్ గా గ్యాప్ ఇచ్యి హీరోగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడట విశ్వక్. ప్రస్తుతం విశ్వక్‌ చేతిలో మూడు సినిమాలున్నాయి. కాగా  విశ్వక్‌ సేన్ కు దర్శకుడు పూరి జగన్నాథ్‌ అవకాశం ఇచ్చినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూరీ దూకుడుగురించి అందరికి తెలిసిందే.. అటువంటి దర్శకుడి చేతిలో విశ్వక్ పడితే.. మాస్ కా దాస్ కి తాతలాంటిసినిమా బయటకు వస్తుంది. 

అయితే ఈన్యూస్ లో నిజమెంతో తెలియదు. గతంలో విజయ్ దేవరకొండ విషయంలో కూడా అంతే అనుకున్నారు. కాని విజయ్ తో భారీ స్టాయిలో ప్లన్ చేసిన  లైగర్ సినిమా రిజల్ట్ ఏమైందో తెలిసిందే. అయితే దీనిపై పూరి జగన్నాథ్ టీమ్ కూడా స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. అవన్నీ రూమర్స్‌ అని, అలాంటి పుకార్లను నమ్మొద్దని చెప్పింది.  అయితే ఊహించని విధంగా లైగర్ ఫ్లాప్‌ కావడంతో.. నెక్స్ట్ ఏంటి అని తెలియని కన్ఫ్యూజన్‌లో పడిపోయాడు పూరీ జగన్నాథ్. విజయ్‌తో పట్టాలెక్కించిన జనగనమణ కూడా  మధ్యలోనే ఆగిపోయింది. దాంతో నెక్ట్స్ ఏంటీ అనే కన్ ఫ్యూజన్ లో ఉన్నాడు  పూరి. 

బాలయ్యతో  పూరీ జగన్నాథ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. గతంలో పైసా వసూల్ తో డిఫరెంట్ వేవ్స్ ను  క్రియేట్ చేశారు ఇద్దరు. ఇక ఇప్పుుడు ఈ ఇద్దరు కలిస్తే.. రచ్చ రచ్చే.కాని ఈసినిమాపై కూడా క్లారిటీ లేదు. దాంతో అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాు. పూరీ జగన్నాధ్ నెక్ట్స్ సినిమా ఎవరితో నో అని. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?