రజినీకాంత్ - అక్షయ్ కుమార్ ప్రధాన తారగణంలో శంకర్ సృష్టించిన 2.0 విజువల్ వండర్ నేడు ప్రపంచం వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికాలో తెలుగు తమిళ్ హిందీ భాషల్లో ప్రీమియర్ షోలను కొద్దిసేపటి క్రితమే ప్రదర్శించారు. అయితే సినిమా ఎలా ఉందంటే...
రజినీకాంత్ - అక్షయ్ కుమార్ ప్రధాన తారగణంలో శంకర్ సృష్టించిన 2.0 విజువల్ వండర్ నేడు ప్రపంచం వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికాలో తెలుగు తమిళ్ హిందీ భాషల్లో ప్రీమియర్ షోలను కొద్దిసేపటి క్రితమే ప్రదర్శించారు. అయితే సినిమా ఎలా ఉందంటే...
శంకర్ చెప్పినట్టుగానే మరోసారి గ్లోబల్ మెస్సేజ్ తో ప్రపంచాన్నీ ఉలిక్కిపడేలా చేశాడని చెప్పాలి. సెల్ ఫోన్ తో మనిషి ఎంతగా లీనమయ్యాడో కొన్ని సన్నివేశాల్లో అర్థమయ్యేలా చెప్పి తరువాత అక్షయ్ కుమార్ ఎపిసోడ్ ని అందరూ షాక్ అయ్యేలా చూపించాడు. అసలు తెరపై కనిపిస్తోంది బాలీవుడ్ హీరో అక్షయ్ కుమారేనా అనిపిస్తోంది. ఆ పాత్రను విలన్ అని చెప్పలేము. విభిన్నమైన షేడ్స్ లలో శంకర్ అక్షయ్ పాత్రను అద్భుతంగా డిజైన్ చేశాడు.
undefined
శంకర్ దర్శకత్వ శైలి ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. తన స్టైల్ ఎక్కడా మిస్ అవ్వకుండా కొత్త విషయాలనెన్నో చెప్పే ప్రయత్నం చేశాడు. గ్రాఫిక్స్ ఆలస్యం కావడానికి గలా కారణం సినిమా చుస్తే క్లారిటీగా అర్ధమవుతుంది. శంకర్ ప్రతి సీన్ లో విజువల్ మాజాని చూపించాడు. 3డిలో కథను ఎలా సిద్ధం చేయాలో హాలీవుడ్ కి సైతం ఒక సమాధానం చెప్పాడని చెప్పవచ్చు.
ముఖ్యంగా పక్షికి సంబంధించిన సీన్స్ 3డి లో ఆకట్టుకున్నాయి. అలాగే చిట్టి రీలోడెడ్ అంటూ స్టార్టింగ్ టూ ఎండింగ్ అదరగొట్టేసాడు. చిట్టి - పక్షి రాజా సీన్స్ తెరపై ఎంతగానో ఆకట్టుకున్నాయి. రజినీకాంత్ స్టైల్ ని శంకర్ మరోసారి బాగా ఎలివేట్ చేశారు. వశీకరణ్ పాత్రలో కూడా సింపుల్ అండ్ సూపర్బ్ అనిపించారు. ఇక అమీ జాక్సన్ పాత్ర లేడి రోబోగా బాగానే ఎట్రాక్ట్ చేసింది. మోస్ట్ కాస్ట్లీ సాంగ్ యంతర లోకపు సుందరివే బిగ్ స్క్రీన్ పై అద్భుతంగా ఉంది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. రెహమాన్ తన స్టామినా ఏంటో చూపించాడు.
కథ విషయానికి వస్తే మెయిన్ ప్లాట్ అందరికి తెలిసిందే. సెల్ ఫోన్స్ మాయమవ్వడం.. ఆ తరువాత జరిగే హత్యలు, పరిణామాల గురించి చర్చలు జరిపి ప్రభుత్వం వశీకరణ్ సాయంతో చిట్టిని మళ్ళీ రప్పిస్తారు. అనంతరం అసలైన కథ మొదలవుతుంది. సినిమాలో శంకర్ మంచి ట్విస్ట్ కూడా సెట్ చేసుకున్నాడు.
మొత్తానికి శంకర్ ఫ్యాన్స్ ఊహలను అందుకోవడమే కాకుండా దాదాపు దాటేశాడని చెప్పవచ్చు. సినిమా 2 గంటల పాటు కనుల విందుగా ఉంటుంది. సో శంకర్ బాక్స్ ఆఫీస్ ను మరోసారి బద్దలు కొట్టేస్తాడు. అందులో నో డౌట్..