మొన్న గిఫ్ట్ పంపాడు, నేడు ఏకంగా బిర్యానీ తిపించాడు.. హీరో నవీన్ పొలిశెట్టి రూటే సెపరేటు..

Published : Aug 29, 2023, 03:48 PM IST
మొన్న గిఫ్ట్ పంపాడు, నేడు ఏకంగా బిర్యానీ తిపించాడు.. హీరో నవీన్ పొలిశెట్టి రూటే సెపరేటు..

సారాంశం

అందరు హీరోల కంటే కాస్త బిన్నంగా ఆలోచిస్తున్నాడు యంగ్ స్టార్ నవీన్ పొలిశెట్టి(Naveen PoliShetty). ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన ఈ హీరో.. ఆమధ్య తన ఫ్యాన్స్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. మంచి కుర్రాడు అనిపించుకుంటున్నాడు. 

ఇండస్ట్రీలో ఈమధ్య వారసులు ఎక్కువైపోయారు.. కాని అదే టైమ్ లో ఎటువంటి  సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. సూపర్ సక్సెస్ అయినవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో  టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి(Naveen PoliShetty) కూడా ఒకరు. కెరీర్ బిగినింగ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు చేసిన నవీన్.. ఆతరువాత హీరోగా అవతరించి.. తన టాలెంట్ తో  ప్రేక్షకులను మెప్పించాడు. 

 ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' మూవీతో హీరోగా మారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం యంగ్ హీరో నటిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (Miss Shetty Mr Polishetty)సినిమా వచ్చే నెలలో రిలీజ్ కు రెడీ అవుతోంది. అనుష్క తో కలిసి ఈ సినిమాలో సందడి చేయబోతున్నాడు నవీన్ పొలిశెట్టి.. ఈ క్రేజీ కాంబినేషన్ పై.. ఆడియన్స్ ఇంట్రెస్ట్ గా ఉన్నారు. సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అంతే కాదు... నవీన్ కు సబంధించి మరో వార్త కూడా ప్రస్తుతం హైలెట్ అవుతుంది. 

ఈ మధ్య నవీన్ పొలిశెట్టి ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నాడు. మొన్నటికి మొన్న ఓ ప్రమోషన్  వీడియోచూసి అభిమాని అడిగాడని.. తన ఫ్యాన్స్ కు కాస్ట్లీ షర్ట్ ను పంపించాడు నవీన్ పొలిశెట్టి. ఇక ఇప్పుడు ఓ అభిమానికి ఏకంగా బిర్యాని తినిపించాడు.. అది కూడా తన స్వహస్తాలతో.. ఇంతకీ అసలు కథ ఏంటంటే..? 

పి.మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’(Miss Shetty Mr Polishetty) సినిమాలో నవీన్‌ సరసన అనుష్క శెట్టి నటించింది. ఈ సినిమా సెప్టెంబరు 7న తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. ఈమూవీ ప్రమోషన్ లో భాగంగా విజయవాడ, గుంటూరుల్లో పర్యటించాడు నవీన్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్ల జోరు పెంచారు టీమ్. 

ఆ క్రమంలో విజయవాడ, గుంటూరులో ఆదివారం పర్యటించాడు. మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి ప్రచారం కోసం ఇప్పటివరకు చేసిన టూర్లలో విజయవాడ టూర్‌ బాగా నచ్చిందని చెప్పాడు.దాంతో పాటు అక్కడ ఫ్యాన్స్‌ మధ్య చేసిన సందడికి సంబంధించిన ఓ వీడియోను షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడకు వచ్చిన తన అభిమానికి నవీన్ తన స్వహస్తాలతో కుండ బిర్యానీని తినిపించడం హైలెట్ గా మారింది.

 విజయవాడలోని ఈట్‌ స్ట్రీట్‌లో కారుపై కూర్చొని కాసేపు అభిమానుల మధ్య తిరిగాడు నవీన్‌. ఈ సందర్భంగా ఆయన బిర్యానీ తింటుండగా చాలామంది అభిమానులు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.అక్కడున్న వారిని తోసుకుంటూ ముందుకొచ్చిన ఓ అభిమానికి నవీన్‌ తాను తింటున్న బిర్యానీ రుచి చూపించారు అనంతరం, బిర్యానీతో కూడిన కుండను ఆయన చేతికందించాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక ఈ మధ్య భారతదేశంలోని ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్‌లలో ఒకటైన ట్విల్స్ నవీన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది. ఆ ప్రమోషన్ లో భాగంగా..  ఆయన వీడియో చేశారు. ట్విల్స్ X నవీన్ పోలిశెట్టి  కలెక్షన్ ఇప్పుడు వారి అన్ని స్టోర్‌లలో అందుబాటులో ఉంటుందని చెప్పడానికి ఆనందంగా ఉంది. కాబట్టి, ఇప్పుడే షాపింగ్ చేయండి అన్నారు. నాలా మికు నచ్చిన బట్టలు వేసుకోండన్నాడు. దాంతో ఓ అభిమాని  ఓ కోరిక కోరాడు. 

'మీరు వేసుకున్న షర్ట్ నాకు బాగా నచ్చింది.. అది గిఫ్ట్ గా ఇవ్వొచ్చుగా అన్నా. అది ఎక్కడ దొరుకుంటుందో లింక్ అయినా ఇవ్వన్నా' అని నవీన్ ను కోరాడు. దీనికి యువ హీరో రియాక్ట్ అవుతూ.. ఈ  చొక్కానే పంపిస్తనాు .. అడ్రస్ చెప్పమన్నాడు. అన్నట్టుగానే అభిమానికి షర్ట్ పంపించాడు. ఈ విషయం ఆ అభిమాని సోషల్ మీడియాలో వెల్లడించాడు కూడా. 


 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా