
హీరోయిన్లకు ముద్దులు పెట్డడం ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా ఆసినిమాల దర్శకులు హీరోయిన్లకు ముద్దులు పెట్టడం.. ఏదైనా అడిగితే అది పలకరింపుగా చేశామనడం అలవాటుగా మారింది. ఆమధ్య ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్.. తిరుమల దర్శనానికి వచ్చి.. హీరోయిన్ కృతీ సనన్ కు సెండాఫ్ ఇస్తూ.. ముద్దాడటం వివాదంగా మారింది. ఈ విషయంలో తీవ్రమైన విమర్షలు ఎదుర్కొన్నాడు దర్శకుడు. ఇక ఆ పరిస్థితిని ఫేస్ చేస్తున్నాడు మరో దర్శకుడు. ఈసారి తెలుగు సినిమాల దర్శకుడికి ఈ సిచ్చువేషన్ ఎదురయ్యింది.
ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడు దర్శకుడు ఏ.ఎస్ రవికుమార్ చౌదరి. ఈ పేరును ఎక్కువ మంది గుర్తుపట్టక పోవచ్చు కానీ.. యజ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం వంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు అంటే ఠక్కున గుర్తుకు వస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు చేసిన పనికి నెటీజన్లు మండిపడుతున్నారు.. పిచ్చిపిచ్చిగా తిడుతున్నారు. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే.
ప్రస్తుతం రవికుమార్ చౌదరీ, రాజ్ తరుణ్ హీరోగా తిరగడబారా సామి అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో మన్నారా చోప్రా కీలక పాత్రలో కనిపించబోతోంది. అయితే మన్నారా చోప్రా గతంలో జక్కన్న, రోగ్ సినిమాలు చేసింది. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు టీమ్ అయితే టీజర్ కు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు ఏఎస్ రవి కుమార్ చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. మన్నారా చోప్రాకు మీడియా ముందే ముద్దిచ్చాడు. ఆ సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మన్నారా చోప్రా నవ్వుతూ కవర్ చేసినట్టుగా అనిపించింది.
ఇక ఈవీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై నెటిజన్లు కోపంగా ఉన్నారు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలసు పబ్లిక్ గా ఇదేం పని.. అది కూడా హీరోయిన్ తో ఈ చిలిపి చేస్టలేంటి.. ఇది అసలు పద్దతేనా..? ఇలాంటి వారిని ఊరికే వదిలిపెట్టవద్దు.. హీరోయిన్లు ఎందుకు ఇలా ఊరుకుంటున్నారు. ఇలాంటి పని చేసినప్పుడే వెంటనే గట్టిగా ఇచ్చేయాలి.. వెంటనే ప్రతిఘటిస్తే.. ఇంకోసారి ఇలా చేయరు.. అన్నారు.
ఇక ఓం రౌత్ తో పాటు.. గతంలో సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు స్టేజ్ మీదే కాజల్‌కు ముద్దు పెట్టిగా.. ఆ విషయం కూడా అప్పట్లో సంచలనంగా మారింది. ట్రోలింగ్ తట్టుకోలేకపోయిన చోటాకేనాయుడు.. చివరికి కాజల్‌తో ఉన్న సాన్నిహిత్యంతోనే అలా చేశానని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరీ ఏఎస్ రవికుమార్ తను చేసిన పనికి ఇంకెన్ని తిట్లు పడతాయో.. ఆయన వివరణ ఇస్తారా లేదా అనేది చూడాలి.