గోవా..ఇటలీ.. ఇప్పుడు హిమాలయాల్లో హీరో గోపీచంద్.. ఏం చేస్తున్నారంటే..?

By Mahesh Jujjuri  |  First Published Jan 28, 2024, 9:59 AM IST

సడెన్ గా హిమాలయాల్లో ప్రత్యక్ష్యం అయ్యారు హీరో గోపీచంద్. ఇంత హాఠాత్తుగా ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు... విహారయాత్రకు వెళ్ళాడా..? లేక..? 


టాలీవుడ్ లో ఒకప్పుడు వరుసగా హిట్ సినిమాలు అందించాడు గోపీచంద్.  ప్రస్తుతం మనోడి టైమ్ బాగోలేనదు.. ఏ సినిమా చేసినా అది నిరాశే మిగుల్చుతుంది. అయినాసరే.. గెలుపోటములతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు టాలీవుడ్ మ్యాచో హీరో. ఇక ఈ హ్యాండ్సమ్ హీరో.. మారుతి డైరెక్షన్ లో చేసిన సినిమా గట్టిగా దెబ్బ కొట్టడంతో.. కాస్త గ్యాప్ తీసుకుని సెట్స్ మీదకు వెళ్ళాడు. ప్రస్తుతం ప్లాప్ సినిమాలతో సావాసం చేస్తున్న శ్రీను వైట్లను నమ్మకుకున్నాడు గోపీచంద్. ఈమూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. 

షూటింగ్ ల భాగంగా హిమాలయాల్ల్ ప్రత్యక్షం అయ్యాడు గోపీచంద్.  గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఫస్ట్ మూవీ ఇది. ఈమధ్యనే షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. ఇటలీత పాటు గోవాలో రెండు షెడ్యుల్స్ ను కంప్లీట్ చేశారు. ఏమాత్రంగ్యాప్ లేకుండా వరుసగా షూటింగ్ షెడ్యుల్స్ న ప్లాన్ చేసుకుంటున్నారు టీమ్. ఇక తాజాగా మూడో షెడ్యూల్ షూటింగ్ కోసం  సినిమా టీమ్ అంతా  అంతా హిమాలయాలకు వెళ్లారు.]

Latest Videos

 

shoot moves to the exoctic Himalayas 🏔️

A key schedule is being shot at the foothills of Great Himalayan range in Himachal Pradesh 💥💥

A 's Cinema ❤‍🔥 @harishpeddi … pic.twitter.com/dhaXJ5VLuf

— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar)

హిమాలయాల్లో గోపీచంద్ సహా ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టుగా నిర్మాత వెల్లడిచారు. అయితే ఇంతకు ముందు జరిగిన రెండు షూటింగ్ షెడ్యూల్స్ కంటే కూడా ఇది లాంగ్ షెడ్యుల్ అంటున్నారు. ఎన్నిరోజులు ఇక్కడ షూటింగ్ జరుగుతుంది అనేది మాత్రంతెలియదు. హీరోలకు శ్రీను వైట్ల ఇచ్చే ఏలివేషన్ గురించి అందరికి తెలిసిందే. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి హీరోలను డిఫరెంట్ గా చూపించాడు శ్రీను. 

కాకపోతే అందులో కొన్ని ప్రయోగాలు బెడిసికొట్టినా.. హీరోలను మాత్రంచాలా హ్యాండ్సమ్ గా చూపిస్తూ.. వారి ఇహేజ్ ను ఇంకాస్త పెంచుతాడు శ్రీను వైట్ల..మరి హీరో గోపీచంద్ ను ఎలా చూపిస్తాడు.. హిట్ సినిమా ఇస్తాడా లేదా అనేది చూడాలి. చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై వేణు దోనెపూడి నిర్మిస్తున్న ఈసినిమాలో గోపీచంద్ సరసన కావ్యాథాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈమూవీకి విశ్వం అనే టైటిల్ ను దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 

click me!