పొలిటికల్ ఎంట్రీ కోసం శంకర్ తో విజయ్ దళపతి సినిమా..? పెద్ద ప్లానే వేశారుగా..?

By Mahesh Jujjuri  |  First Published Jan 28, 2024, 8:47 AM IST

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా.. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో భారీ సినిమాకు ప్లాన్ జరుగుతోంది. త్వరలో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో.. ఈ వార్తలపై ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. 


విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీకి సబంధించిన పనులు చాపకింద నీరుల ఎవరికీ తెలియకుండానే అయిపోతున్నాయని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఏక్షణంలో అయినా విజయ్ పార్టీని ప్రకటించే అవకాశం లేకపోలేదు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై ఇప్పటికే రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలో విజయ్ నెక్ట్స్ మన్త్ ఢిల్లీ వెళ్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలోనే విజయ్ తన సినిమాలను కూడా త్వరగా కంప్లీట్ చేసుకోవాలని చూస్తున్నాడట. అంతే కాదు కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ఇచ్చి.. ఆతరువాత మళ్ళీ మొదలెట్టేఆలోచనలో ఉన్నాడట దళపతి. 

ఈక్రమంలోనే విజయ్ పొలిటికల్ ఎంట్రీ గ్రాండ్ గా ఉండేలా.. జనాల్లోకి ఈజీగా వెళ్ళే మార్గాలు అన్వేషిస్తున్నాడట. అందులో భాగంగానే సినిమా ద్వారా విజయ్ జనాలకు ఓ మెసేజ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు టాక్ నడుస్తోంది. అందుకే పాలిటిక్స్ లోకి వెళ్ళేముందు.. ఓ మంచి పొలిటికల్ మూవీని చేసి వెళ్లాలని చూస్తున్నాడట. ఇక ఇటువంటి సినిమాలు చేయడంలో శంకర్ ను మించిన వారు లేరు. గతంలో భారతీయుడు, ఒకే ఒక్కడు, శివాజీ లాంటి సినిమాలు చాలా ప్రభావం చూపించాయి. ఇక త్వరలో భారతీయుడు2 కూడా సందడి చేయబోతోంది. ఈక్రమంలోనే విజయ్ శంకర్ తో ఓ పొలిటికల్ మూవీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.  

Latest Videos

ప్రస్తుతం దళపతి విజయ్ హీరోగా  తన కెరీర్ లో 68వ చిత్రాన్ని దర్శకుడు వెంకట్ ప్రభుతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం తర్వాత విజయ్ తన 69వ సినిమా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ చేస్తున్నట్టుగా టాక్ వచ్చింది. ఈ సినిమా కూడా త్వరగా కంప్లీట్ చేసి..  దీని తర్వాత విజయ్ 70 వ సినిమాగా శంకర్ ను రంగంలోకి దింపబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే  కోలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలయ్యింది. సోషల్ మీడియాలో రచ్చ కూడా జరుగుతోంది. 

అయితే విజయ్ తో గతంలోనే శంకర్ ఓసినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది చేస్తే..రెండో సినిమా అంవుతుంది. అయితే ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే.. ఈ సినిమాను మన టాలీవుడ్ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్  వారు నిర్మించబోతున్నట్టు కూడా టాక్ వస్తోంది. నిప్పులేనిదే పొగ రాదు కదా..? మరి ఈ విషయంలో నిజా నిజాలు ఎంత..? ఈ కాంబో వర్కౌట్ అవుతుందా..? అసలు ఇది నిజమా.. లేక రూమర్ గానే ఉండిపోతుందా అనేది.. అనౌన్స్ మెంట్ వచ్చే వరకూ తెలియదు. 

click me!