మంచి మనసు చాటుకున్న హీరో గోపీచంద్, తన సహాయకుడికి సర్ ప్రైజ్ ఇచ్చిన స్టార్

Published : Mar 02, 2023, 02:32 PM IST
మంచి మనసు చాటుకున్న హీరో గోపీచంద్, తన సహాయకుడికి సర్  ప్రైజ్ ఇచ్చిన స్టార్

సారాంశం

చాలా మంది తారలు సంరద్భాన్ని బట్టి తమ మంచి మనసును చాటుకుంటుంటారు. దానికోసం తన స్టేటస్ ను పట్టించుకోకుండా ఒక మెట్టు దిగి అయినా గోప్పవాళ్లు అనిపించుకుంటారు. ఈక్రమంలో టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కూడా అలాంటి పనే చేశాడు.   


టాలీవుడ్ హీరోలలో చాలా మంది.. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హరోలు అనిపించురకుంటున్నారు. మనస్సున్న మారాజులనిపించరకుంటుంటారు. మనకెందుకులే అనుకోకండా.. మన కోసం పనిచేసేవారికి అండగా నిలబడుతుంటారు.  తమ వద్ద పనిచేసే సిబ్బందికి ఏ కష్టమొచ్చిన మాట సాయంతో పాటు వారికి అండగానూ నిలుస్తున్నారు. ఆర్థిక సాయం చేస్తుంటారు. కాని ఈ విషయాలు.. చేసిన సాయం ఎవరికీ తెలియకుండా.. ప్రచారానికి దూరంగా ఉంటారు.  అటువంటి హీరోనే అనిపించుకున్నారు టాలీవుడ్ యంగ్ టాలెండెట్ స్టార్ గోపిచంద్.

టాలీవుడ్ హీరో గోపిచంద్ రీసెంట్ గా తన దగ్గర పనిచేసే వ్యాక్తికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన దగ్గర వ్యక్తిగత సహాయకునిగా  శ్రీను అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అతను రీసెంట్ గా ఓ చిన్న ఇల్లు కట్టుకున్నాడు. బుదవారం రోజు  గృహ ప్రవేశం ఉన్నంతలో చేసుకున్నాడు.  అయితే ఈ కార్యక్రమానికి గోపిచంద్ సడెన్ గా వచ్చారు. ముందు కచెప్పకుండా వచ్చిన ఆయన.. తన అసిస్టెంట్ తో పాటు.. అతని ఫ్యామిలీని కూడా  ఆశ్చర్యపరచడంతో పాటు.. అక్కడే చాలాసేపు ఉండి సందడి చేశారు. పూజలో కూడా  పాల్గొని ఆ కుటుంబ సభ్యులను ఆశ్వీరదించారు. 

అనుకోకుండా హీరో గోపిచంద్ రావడంతో  శ్రీను ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయారు. ఏంచేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అయ్యారు.  తమ వ్యాక్తిగత సింబందిని దూరం పెడుతూ.. వారిని వర్కర్లుగానే చూస్తుంటారు చాలామంది. కాని కొంత మంది మాత్రమే ఇలా వ్యక్తిగత సిబ్బంది పిలిస్తే వెళ్లాల్సిన అవసరం లేనప్పటికీ.. ఆయన వారి ఇంటికి వెళ్లారు. దీంతో ఆయన మనసున్నవ్యక్తిగా మరోసారి నిరూపించుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు