నేనీ స్టేజీకి వచ్చానంటే ఆయనే కారణం.. జీవితాంతం రుణపడి ఉంటా.. సుడిగాలి సుధీర్ ఎమోషనల్!

Published : Mar 02, 2023, 02:01 PM IST
నేనీ స్టేజీకి వచ్చానంటే ఆయనే కారణం..  జీవితాంతం రుణపడి ఉంటా.. సుడిగాలి సుధీర్ ఎమోషనల్!

సారాంశం

బుల్లితెర స్టార్, నటుడు సుడిగాలి సుధీర్ (Sudigaali Sudheer) తాజాగా ఆ వేదికపై ఎమోషనల్ అయ్యారు. తనకు మంచి జీవితాన్ని  అందేలా చేసిన ఆయనకు జీవింతాంతం రుణపడి ఉంటానన్నారు.   

జబర్దస్త్ కమెడియన్, నటుడు వేణు దర్శకత్వంలో  ‘బలగం’ Balagam చిత్రం రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే.  ప్రియదర్శి,  కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా, వేణు దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. మార్చి 3న (రేపు) ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ సందర్భంగా  చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సిరిసిల్లాలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్, దిల్ రాజ్, ప్రముఖులు హాజరైన టీమ్ ను అభినందించారు. 
 
ఈవేడుకలో పాల్గొన్న సుడిగాలి సుధీర్ కూడా చిత్రం పెద్ద హిట్  కావాలని ఆకాంక్షించారు. వేదికపై మాట్లాడుతూ... ‘నేను ఇవ్వాళ ఈస్టేజీలో ఉన్నానంటే అందుకు కారణం వేణు అన్న. ఆయన చేసిన సాయాని నేను,  నా కుటుంబం మూడు పూటలా తింటున్నాం. నాకు జబర్దస్త్ లో ఛాన్స్ ఇచ్చి, అండగా నిలిచిన వేణన్నకు జీవింతాంతం రుణపడి  ఉంటాను.’ అంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే వేణుకు దర్శకుడిగా అవకాశం అందించిన ప్రొడ్యూసర్ దిల్ రాజుకు స్పెషల్ థ్యాంక్ చెప్పారు.  ఇక సుధీర్ ప్రస్తుతం ‘జబర్దస్’ నుంచి వచ్చేసిన విషయం తెలిసిందే.  హీరోగా పూర్తి స్థాయిలో అవకాశాలను అందుకుంటున్నారు.  

యూత్ స్టార్ సుడిగాలి సుధీర్ ‘జబర్దస్’ కమెడియన్ గా బుల్లితెర ఆడియెన్స్ లో ఎంతటి గుర్తింపు దక్కించుకున్నాడో తెలిసిందే. సోషల్ మీడియాలో ఆయనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే మామూలు విషయం కాదు. పదేండ్ల పాటు కమెడియన్ గా బుల్లితెరపై నవ్వులు పూయించిన సుధీర్.. ప్రస్తుతం హీరోగానూ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. తొలుత రెండు చిత్రాలు కాస్తా నిరాశపరిచిన రీసెంట్ గా వచ్చిన ‘గాలోడు’ (Gaalodu) మాత్రం మంచి విజయాన్ని సాధించి పెట్టింది. ఒకరకంగా చెప్పాలంటే మాస్ హిట్ ను అందుకొని చిన్న హీరోల జాబితాలో చేరిపోయాడు. 

PREV
click me!

Recommended Stories

Lakshmi Pranathi: కోటీశ్వరుడి కూతురు.. స్టార్ హీరో భార్య, లైమ్‌లైట్‌కు దూరంగా సింపుల్ లైఫ్..
Karthika Deepam 2 Today Episode: దీపకు జ్యో వార్నింగ్- జ్యోకు కార్తీక్ కౌంటర్- జ్యోపై సుమిత్ర కోపం