నాగచైతన్యకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా..? వింటే షాక్ అవుతారు.

Published : Dec 30, 2023, 02:39 PM IST
నాగచైతన్యకు  ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా..? వింటే షాక్ అవుతారు.

సారాంశం

ఫుడ్ విషయంలో హీరోల అలవాట్లు వేరుగా ఉంటాయి. నచ్చినవి తినడం అటుంచి.. కడుపునిండా ఏమీ తినలేదు....కొంతమంది మాత్రంనచ్చినవి లాంగించేస్తారు. ఈక్రమంలో అక్కినేని హీరో నాగచైతన్య ఫుడ్ అటవాట్లపై ఓ చిన్న ఇన్ఫర్మేషన్. 

ఫిల్మ్ సెలబ్రిటీలకు నచ్చిన ఫుడ్ కడుపునిండా  తినే అదృష్టం ఉండదు. మహేష్ బాబు చెప్పిన్నట్టు ఎక్కువ తిసుకుని తింటే.. లావైపోతారుఅని  ఊరికే అనలేదు. నచ్చిన తిండిని కూడా మితంగా తినబట్టే అంత హ్యాండ్సమ్ గా.. ఫిట్ గా ఉంటారు హీరోలు. అయితే కొంత మంది మాత్రం నచ్చిన తిండి తిన్నా.. ఫిట్ నెస్ మాత్రం బాగా మెయింటేన్ చేస్తారు. మరికొందరు మాత్రం అన్నీ తినకపోయినా.. నచ్చిన ఓ ఐటమ్ అయినా కాస్త ఎక్కువగా లాగించేస్తుంటారు. ఈకోవలోకే వస్తారు అక్కినేని హీరో నాగచైతన్య. 

నాగచైతన్య మంచి ఫుడీ.. అదై టైమ్ లో ఆయన ఫిట్ నెస్ కూడా బాగా మెయింటేన్ చేస్తుంటారు. ఫుడ్ మీద చైతూకున్న గ్రీప్ మూమూలుది కాదు.. ఆ ఎక్స్ పీరియన్స్ ను వాడుకుని.. హైదరాబాద్ తో పాటు పలు చోట్ల ఆయన ఫుడ్ బిజినెస్ లు కూడా చేస్తున్నారట. పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఓపెన్ చేసినట్టు సమాచారం. ఈక్రమంలో నాగచైతన్యను ఇష్టమైన ఫుడ్ గురించి ప్రస్తుతం ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ అక్కినేనివారి హీరో ఇష్టంగా ఏ ఫుడ్ తింటారు. ఏంటీ..? ః

 ప్రస్తుతం కర్నాటకలో ఉన్నారు చైతూ.. చందూమొండేటి తెరకెక్కిస్తున్న తండేల్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈమూవీ షూటింగ్ లో సాయి పల్లవి కూడా అడుగు పెట్టింది. ఇక రీసెంట్ గా   ధూత వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగుపెట్టిన  చైతూ మంచి హిట్ నుఅందుకున్నాడు.  ప్రస్తుతం తండేల్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్  గోకర్ణలో జరుగుతుంది. ఇక చైతూ మంచి నటుడు, ఫుడీ.. మంచి బిజినెస్ మెన్ కూడా. ఆయనకు ఫుడ్ అంటే ఇష్టం కాబట్టే పుడ్ బిజినెస్ లో దిగాడు. హైదరాబాద్ లో షోయూ అనే రెస్టారెంట్ ప్రారంభించాడు. 

తనకు నచ్చిన ఫుడ్ గురించి వెల్లడించాడు చైతూ.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ తనకు ఇష్టమైన ఫుడ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను అచ్చమైన తెలుగు తిండి తింటానన్నాడు చైతూ.. వైట్ రైస్.. ముద్దపప్పులో నెయ్యివేసుకుని తింటాడట. అంతే కాదు ముద్దు పప్పు..పచ్చిపులుసు కాంబినేషన అంటే ఎంతో ఇష్టం అంటున్నాడు చైతూ. అంతే కాదు.. వాటికి సైడ్ డిష్ లు గా మటన్  కాని..రొయ్యల ప్రై కాని తీసుకుంటాడట. 
 
ఈ ఐటమ్స్ అంటే ఎంతో ఇష్టం అంటున్నాడు నాగచైతన్య.. అంతే కాదు అప్పుడప్పుడు జపనీస్ ఫుడ్ కూడా తింటాడట చైతూ.. ఇక చైతూ ఫుడ్ హ్యాబిడ్స్ తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు. ఇప్పటికీ మన తెలుగు వంటలు హీరోలు ఇష్టపడుతున్నారంటే గ్రేట్ అంటూ  మాట్లాడుకుంటున్నారు జనాలు. ఇక అక్కినేని ఫ్యాన్స్ అయితే ఈ విషయం చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం