టాలీవుడ్ లో మరో విషాదం, దర్శకుడు, ఛాయాగ్రాహకుడు రాజేంద్ర ప్రసాద్ ఇకలేరు

By Mahesh JujjuriFirst Published Aug 19, 2022, 7:50 PM IST
Highlights

ఫిల్మ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు ముంచెత్తుతున్నాయి. వరుసగా నటులు, దర్శకులు, గాయలకులు పరిశ్రమను విడిచి శాస్వతంగా వెళ్లిపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే పదుల సంఖ్యలో ఇండస్ట్రీ వారు మరణించారు. ఇక రీసెంట్ గా మరో ఫిల్మ్ మేకర్ కన్ను మూశారు. 

ఫిల్మ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు ముంచెత్తుతున్నాయి. వరుసగా నటులు, దర్శకులు, గాయలకులు పరిశ్రమను విడిచి శాస్వతంగా వెళ్లిపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే పదుల సంఖ్యలో ఇండస్ట్రీ వారు మరణించారు. ఇక రీసెంట్ గా మరో ఫిల్మ్ మేకర్ కన్ను మూశారు. 

ప్రముఖ ఛాయాగ్రాహకులు,  దర్శకులు,  నిర్మాత రాజేంద్ర ప్రసాద్ ఈరోజు కన్నుమూశారు. ఎన్నో చిత్రాలు చేసి  విమర్శకుల ప్రశంసలు అందుకుని.. ప్రేక్షకుల మన్ననలు పొందిన ఫిల్మ్ మేకర్ రాజేంద్ర ప్రసాద్.. తుదిశ్వాస విడిచారు. ఆ నలుగురు సినిమాతో తెలుగు వారి మనసుల్లో స్థానం సంపాదించారు రాజేంద్ర ప్రసాద్. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చంద్ర సిద్ధార్థకు రాజేంద్ర ప్రసాద్ సోదరులు.  

1995 లో నిరంతరం సినిమాతో టాలీవుడ ఎంట్రీ ఇచ్చాడు రాజేంద్ర ప్రసాద్. ఈ సినిమాకు రాజేంద్ర ప్రసాద్ దర్శక నిర్మాత మరియు రచయిత. నిరంతరం  సినిమా మలేషియాలోని కైరో చలన చిత్రోత్సవాలకు ఎంపిక అయ్యింది. పలువురి ప్రశంసలు అందుకుంది. హాలీవుడ్‌లో మన్ విమన్ అండ్ ది మౌస్, రెస్డ్యూ - వేర్ ది ట్రూత్ లైస్, ఆల్ లైట్స్, నో స్టార్స్ సినిమాలకు ఆయన  దర్శకత్వం వహించారు. ఇక మరో విశేషం ఏమిటంటే.. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నిటికీ ఆయనే సినిమాటోగ్రఫీ, రైటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

తెలుగులో మేఘం, హీరో సహా కొన్ని సినిమాలకు  రాజేంద్ర ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. అంతే కాదు కొన్ని హిందీ సినిమాలు కూడా ఆయన పనిచేశారు. అయితే టాలీవుడ్ సినిమాల నుంచి బాలీవుడ్ చేరిన రాజేంద్ర ప్రసాద్ ముంబై వెళ్లి  స్థిరపడ్డారు. ఇక రాజేద్రప్రసాద్  మృతి పట్ల.. టాలీవుడ్ ,బాలీవుడ్  ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. 


 

click me!