లాల్ సింగ్ చడ్డా రిజల్ట్స్ పై హీరో మాధవన్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

By Mahesh JujjuriFirst Published Aug 19, 2022, 2:28 PM IST
Highlights

సీనియర్ కోలీవుడ్ హీరో మాధవన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన లాల్ సింగ్ చడ్డా ఫలితంపై మాధవన్ మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏమన్నారు..? 

అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా,  మాధవన్ రాకెట్రీ ఈ రెండు సినిమాలు ఒక సారే రిలీజ్ అయ్యాయి. అయితే భారీ అంచనాలతో  బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్  హీరోనా నటించిన లాల్ సింగ్ చడ్డా డిజాస్టర్ గా మిగిలింది. కాని మాధవన్ హీరోగా ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన రాకెట్రీ సినిమా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో  మాధవన్ నటించడమే కాకుండా స్వయంగా డైరెక్ట్ చేశారు కూడా. 

ఇక  ఈక్రమంలోనే అమీర్ ఖన్  లాల్ సింగ్ చడ్డా పరాజయం, రాకెట్రీ సినిమా  హిట్ కావడంపై మాధవన్ స్పందించారు. మాధవన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ హిట్ అవుతుందనే ఉద్దేశంతోనే సినిమా చేస్తారు.. ఒక ఫెయిల్యూర్ సినిమాను తీయబోతున్నామనే భావనతో ఎవరూ సినిమా తీయరని మాధవన్  అన్నారు. అన్ని సినిమాల మాధిరిగానే  లాల్ సింగ్ చడ్డా టీమ్ కూడా బాగా కష్టపడ్డారని అన్నారు మాధవన్.   ఆడియన్స్ లో ప్రస్తుతం మార్పు కనిపిస్తుందన్నారు సీనియర్ హీరో.. ప్రస్తుతం వారు ప్రపంచ సినిమా స్థాయికి వెళ్లిపోయారని మాధవన్ తెలిపారు. 

ఇక తన సినిమా రాకెట్రీ గురించి మాట్లాడుతూ.. ఇదొక బయోపిక్ .. ఇలాంటి సినిమాలు ఎప్పుడైనా ఆడతాయని అన్నారు స్టార్ హీరో.  కరోనాకు ముందులా ఇప్పుడు ఆడియన్స్ లేరని... ఆడియన్స్ అందరిలో మార్పు వచ్చేసిందని అన్నారు. థియేటర్లలో సినిమాలు ఆడేలా స్క్రీన్ ప్లేను పక్కాగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని హితబోద చేశారు మాధవన్.  

ఇక ఈ క్రమంలోనే కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మాధవన్.  సినిమా బాగుంటే థియేటర్లకు ఆడియన్స్ ఖచ్చితంగా వస్తారన్నారు.  సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ... . బాహుబలి 1, బాహుబలి 2, కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు హిందీ స్టార్ల సినిమాల కంటే బాగా ఆడాయని చెప్పారు. కరోనాకు ముందు ప్రేక్షకులు ఒక ఇండస్ట్రీకి చెందిన సినిమాలను మాత్రమే చూస్తుండేవారని... కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సినిమాలను చూసేందుకు అలవాటు పడ్డారని మాధవన్ వివరించారు. 

ఇక ఫైనల్ గా హీరో ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడుతుందనే రోజులు పోయాయి అంటున్నారు మాధవన్. ఆడియన్స్ కు నచ్చే విధంగా సినిమాలు చేస్తూ.. తప్పకుండా సినిమాలు చూస్తారన్నారు. వారి అభిరుచికి విరుద్థంగా సినిమాలు చేస్తే.. ప్రేక్షకులు ఆదరించరన్నారు. అందుకే వారికి తగ్గట్టు మనం..మన మేకర్స్ కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు మాధవన్. 

click me!