ఖాళీ సమయంలో సమంత ఇంట్లో చేసే పనులు ఇవా... వైరల్ గా ఇంస్టాగ్రామ్ వీడియో!

Published : Jul 15, 2021, 12:11 PM IST
ఖాళీ సమయంలో సమంత ఇంట్లో చేసే పనులు ఇవా... వైరల్ గా ఇంస్టాగ్రామ్ వీడియో!

సారాంశం

సమంత ఇంస్టాగ్రామ్ వీడియో వైరల్ గా మారింది. వీడియో చూసిన రష్మిక, మంచు లక్ష్మీ వంటి సెలెబ్రిటీలు స్పందించడం జరిగింది.   


సమంత లాంటి స్టార్స్ కి ఖాళీ సమయం దొరకడం చాలా అరుదు. షూటింగ్స్, మీటింగ్స్ తో బిజీగా ఉండే ఆమెకు ఖాళీ సమయం దిరికితే తన ఎంతో ఇష్టమైన పెట్ డాగ్ తో ఆడుకుంటూ ఉంటారు. చాలా కాలంగా సమంత పెట్ డాగ్ యాష్ తో అనుబంధం కలిగి ఉన్నారు. యాష్ తన కొడుకుతో సమానం అంటుంది ఆమె. అంతటి అనుబంధం సమంత యాష్ తో కలిగి ఉంది. తాజాగా యాష్ తో ఆడుకుంటున్న వీడియో సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది. 


తన ఇంటి ఆవరణలోని గార్డెన్ లో సమంత యాష్ తో ఆహ్లాదంగా గడిపారు. ఓ బెలూన్ క్రింద పడకుండా యాష్ పైకి నెడుతూ చక్కగా ఆడుతుంది. సమంత పెట్ డాగ్ తెలివి తేటలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రష్మిక మందాన, మంచు లక్ష్మి వంటి సెలబ్రిటీలు, వావ్ అంటూ ఈ వీడియోకి స్పందించారు. 


మరోవైపు సమంత శాకుంతలం షూటింగ్ లో పాల్గొంటున్నారు. సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన శాకుంతలం షూటింగ్ తిరిగి ప్రారంభించారు. దర్శకుడు గుణశేఖర్ పౌరాణిక గాథగా శాకుంతలం మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కోసం హైదరాబాద్ లో భారీ సెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది.పాన్ ఇండియా మూవీగా శాకుంతలం పలు బాషలలో విడుదల కానుంది. 


ఇక సమంత ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ తో భారీ విజయం అందుకుంది. ఆమె డెబ్యూ డిజిటల్ ఎంట్రీ ఫ్యామిలీ మాన్ 2 రికార్డు వ్యూస్ రాబడుతుంది. శ్రీలంకకు చెందిన లేడీ రెబల్ పాత్రలో సమంత అద్భుతం చేసింది. ఆమె పాత్రకు విశేష ఆదరణ దక్కింది. అలాగే ఈ సిరీస్ పై తమిళులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 


 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి