గూస్ బంప్స్ గ్యారంటీ... అంచనాలు ఆకాశానికి చేర్చిన ఆర్ ఆర్ ఆర్ మేకింగ్ వీడియో

By team teluguFirst Published Jul 15, 2021, 11:39 AM IST
Highlights

సినిమా తెరకెక్కించడంలో రాజమౌళి మాస్టర్ టెల్లర్ ని మరోమారు రుజువు చేసుకున్నారు. మేకింగ్ వీడియోతోనే ఆర్ ఆర్ ఆర్ అద్బుతంగా ఉంటుందనే విషయంపై ఆయన స్పష్టత ఇచ్చినట్లు అయ్యింది.

రాజమౌళి ఈ విషయంలో నిరాశపెట్టరని మరోమారు రుజువు చేసుకున్నారు. నేడు విడుదలైన ఆర్ ఆర్ ఆర్ మేకింగ్ వీడియో గూస్ బంప్స్ కలిగించేదిగా ఉంది. ప్రేక్షకుల అంచనాలకు మించి అతిపెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కినట్లు అర్థం అవుతుంది. భారీ సెట్స్, మతిపోయే విజువల్స్ తో ఆర్ ఆర్ ఆర్ హాలీవుడ్ స్థాయి చిత్రంలా ఉంటుంది, అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి.. ఆర్ ఆర్ ఆర్ ని మరింత గ్రాండ్ గా తీర్చిదిద్దింది. 


హాలీవుడ్ కి చెందిన నటులు, సాంకేతిక నిపుణులు ఆర్ ఆర్ ఆర్ కి పనిచేస్తుండగా, సినిమా మరిన్ని బాషలలో విడుదల కానుంది. ఇక ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ సాహసాలు మరో స్థాయిలో ఉన్నాయి. ఇద్దరు హీరోలు తమ పాత్రల కోసం చమటోడ్చినట్లు స్పష్టంగా తెలుస్తుంది. యాక్షన్ ఈ స్థాయిలో ఉన్న కారణంగానే ఎన్టీఆర్, రామ్ చరణ్ గాయాలాపాలు కావడం జరిగింది. 


సినిమా తెరకెక్కించడంలో రాజమౌళి మాస్టర్ టెల్లర్ ని మరోమారు రుజువు చేసుకున్నారు. మేకింగ్ వీడియోతోనే ఆర్ ఆర్ ఆర్ అద్బుతంగా ఉంటుందనే విషయంపై ఆయన స్పష్టత ఇచ్చినట్లు అయ్యింది. దాదాపు రెండు నిమిషాల మేకింగ్ వీడియో చాల గ్రాండ్ గా వుంది. మొత్తంగా నెలల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు మరో విజువల్ వండర్ రానుందని తెలుస్తుంది. 


పాటల చిత్రీకరణ మినహా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి అయ్యింది. రెండు భాషలకు గాను ఎన్టీఆర్, చరణ్ డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్లు ఆర్ ఆర్ యూనిట్ తెలియజేయడం జరిగింది. ఇక రెండు సార్లు వాయిదా అనంతరం అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ విడుదల కానున్నట్లు వెల్లడించారు. 

We hustle, we have fun! It has been such an exciting experience to work with this team for .

A journey I will forever cherish. Happy to share a glimpse into the making of .https://t.co/DgY8x05hjA

— Jr NTR (@tarak9999)
click me!