నెలలు నిండకుండానే ప్రసవించిన నాగ్ హీరోయిన్... సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

Published : Jul 15, 2021, 09:34 AM IST
నెలలు నిండకుండానే ప్రసవించిన నాగ్ హీరోయిన్... సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

సారాంశం

జులై 14వ తేదీన తమకు అబ్బాయి జన్మించినట్లు దియా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అవ్యాన్ ఆజాద్ రేఖీగా నామకరణం చేశారని సమాచారం. అయితే నెలలు నిండకుండానే ప్రసవం అయినట్లు దియా మీర్జా తెలియజేశారు. 


కింగ్ నాగార్జున లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ వైల్డ్ డాగ్. ఈ మూవీలో కీలక రోల్ చేశారు బాలీవుడ్ భామ దియా మీర్జా. కాగా దియా మీర్జా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. జులై 14వ తేదీన తమకు అబ్బాయి జన్మించినట్లు దియా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అవ్యాన్ ఆజాద్ రేఖీగా నామకరణం చేశారని సమాచారం. అయితే నెలలు నిండకుండానే ప్రసవం అయినట్లు దియా మీర్జా తెలియజేశారు. దీనితో పసికందును ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారట. 


అవ్యాన్ ని చూడడానికి కుటుంబ సభ్యులు ఆతృతగా ఎదురుచూస్తున్నారని, మేము కూడా త్వరగా ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నామని తెలిపారు. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు, డాక్టర్స్ సహాయంతో ఆ సమస్య నుండి బయటపడి, బిడ్డకు జన్మను ఇచ్చినట్లు తన సుదీర్ఘ సోషల్ మీడియా పోస్ట్ లో వివరించారు. దియా మీర్జా. దియా మీర్జాకు సోషల్ మీడియా వేదికగా సన్నిహితులు, ఫ్యాన్స్ నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 


మిస్ ఆసియా పసిఫిక్ ఇంటెర్నేషనల్ 2000 టైటిల్ అందుకున్న దియా మీర్జా బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించారు. ఆమె ఫిబ్రవరి 2021లో పెళ్ళై పిల్లలు ఉన్న బిజినెస్ మాన్ అనుభవ్ రేఖీని వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లుగా ఆయనతో సన్నిహితంగా ఉంటున్న దియా మీర్జా తల్లికావడం జరిగింది. 
 

PREV
click me!

Recommended Stories

Toxic Cast Remuneration: రెమ్యూనరేషన్‌లో యష్‌ కి నయనతార గట్టి పోటీ.. టాక్సిక్ స్టార్ల జీతాల వివరాలు
Sridivya without Makeup: మేకప్ లేకుండా నేచురల్‌ అందంతో కట్టిపడేస్తున్న శ్రీదివ్య.. లేటెస్ట్ ఫోటోలు