వంద కోట్లతో తెలుగులో మరో పాన్‌ ఇండియా సినిమా..

Published : Aug 02, 2021, 11:35 AM IST
వంద కోట్లతో తెలుగులో మరో పాన్‌ ఇండియా సినిమా..

సారాంశం

 `రాక్షసుడు` సినిమా విడుదలై రెండేళ్లవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ ప్రకటించారు. దీనికి సీక్వెల్‌ని రూపొందిస్తున్నట్టు గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. 

సస్పెన్స్ థ్రిల్లర్‌గా `రాక్షసుడు` సినిమా రెండేళ్ల క్రితం వచ్చి మంచి విజయాన్ని సాధించింది. బెల్లంకొండ స్థాయి శ్రీనివాస్‌ హీరోగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించారు. అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో వీరంతా హిట్‌ అందుకున్నారు. తాజాగా ఈ సినిమా విడుదలై రెండేళ్లవుతుంది. ఈ నేపథ్యంలో `రాక్షసుడు` కి సంబంధించిన అప్‌డేట్‌ ప్రకటించారు. దీనికి సీక్వెల్‌ని రూపొందిస్తున్నట్టు గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. 

తాజాగా ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఓ పెద్ద స్టార్‌ హీరో ఇందులో హీరోగా నటిస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. నిర్మాత కోనేరు సత్యనారాయణ చెబుతూ, ఈ సినిమాని వంద కోట్ల బడ్జెట్‌తో లావిష్‌గా, పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కించబోతున్నాయి. ఓ పెద్ద స్టార్‌ హీరో ఇందులో నటించబోతున్నారు. సరైన సమయంలో ఆ విషయాలను వెల్లడిస్తాం. మొదటి భాగం కంటే ఈ సినిమా మరింత ఉత్తేజకరంగా, ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఎక్కువ కమర్షియల్‌ అంశాలుంటాయి. హాలీవుడ్‌ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది, త్వరలో లండన్‌లో ఈ చిత్ర షూటింగ్‌ని ప్రారంభిస్తాం` అని తెలిపారు. 

`రాక్షసుడు` సినిమాని బాలీవుడ్‌లో రీమేక్‌ కోసం అక్షయ్‌ కుమార్‌ మమ్మల్ని సంప్రదించారు. ఆయన ఈ పాత్రకి బాగా సూట్‌ అవుతాడని భావించాం. ఆయన కోరినట్టుగా పూజా ఫిల్మ్స్ కి బాలీవుడ్‌ రీమేక్‌ హక్కులను ఇవ్వడం జరిగింది. ఈ సినిమాతో రమేష్‌ వర్మ బాలీవుడ్‌లోకి అడుగపెట్టబోతున్నారు. రవితేజ `ఖిలాడీ` గురించి చెబుతూ, ఇది మా బ్యానర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ చిత్రమవుతుంది. ఈ సినిమా హక్కుల కోసం బాలీవుడ్‌  నుంచి కొంత మంది పెద్ద హీరోలు సంప్రదించారు. త్వరలో ఆ విషయాన్ని వెల్లడిస్తాం` అని చెప్పారు.అలాగే రాబోయే రోజుల్లో హవీష్‌(సత్యనారాయణ తనయుడు) నుంచి అత్యుత్తమ సినిమాలు చూస్తారని చెప్పారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Naga Chaitanya కంటే ముందే.. అఖిల్ తండ్రి కాబోతున్నాడా? తాత కావడంపై నాగార్జున అక్కినేని రియాక్షన్ ఏంటి?
Chiranjeevi-Balakrishna కాంబో సెట్టింగ్‌.. బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించేలా బడా నిర్మాత భారీ స్కెచ్‌