
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రేపు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 'సై రా' టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ లో చిరంజీవి 'ఈ యుద్ధం ఎవరిదీ..? మనది' అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. టీజర్ విడుదలైన గంటలోనే 11 లక్షల డిజిటల్ వ్యూస్ దక్కించుకొని దూసుకుపోతుంది.
మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఈ టీజర్ అద్భుతమంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. యంగ్ హీరో నాని చేసిన కామెంట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. 'ఈ సినిమా ఎవరిదీ..? మనది' అంటూ నాని ట్వీట్ చేశారు.
' మాటల్లేవు.. పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి' అంటూ ట్వీట్ చేయగా.. 'కచ్చితంగా ఈ సినిమా గొప్ప చిత్రంగా నిలుస్తుందని' వరుణ్ తేజ్, 'సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు' సాయి ధరమ్ తేజ్ ట్వీట్లు చేశారు.