స్టార్ హీరోకి నో చెప్పిన 'RX100' హీరోయిన్..?

By Udayavani DhuliFirst Published 21, Aug 2018, 2:30 PM IST
Highlights

అప్పటివరకు బాలీవుడ్ సీరియల్స్ లో, అలానే పంజాబీలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ 'RX100' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది

అప్పటివరకు బాలీవుడ్ సీరియల్స్ లో, అలానే పంజాబీలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ 'RX100' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తన బోల్డ్ పెర్ఫార్మన్స్ తో యూత్ ని ఆకట్టుకుంది. దీంతో ఆమెకి సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ అమ్మడు మాత్రం సెలెక్టెడ్ కథలను మాత్రమే ఎన్నుకుంటుంది.

ఈ క్రమంలో తేజ-బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ ని తిరస్కరించింది. అఖిల్-వెంకీ అట్లూరి సినిమాలో చిన్న రోల్ లో నటించమని అడిగితే నో చెప్పింది. దీన్నిబట్టి అమ్మడు స్టార్ హీరోల సినిమాల్లో లీడ్ హీరోయిన్ పాత్రలు కోరుకుంటుందని తెలుస్తోంది. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు నో చెప్పి వార్తల్లో నిలిచింది. బోయపాటి శ్రీను, రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలో ఐటెం సాంగ్ లో నటించమని పాయల్ ని సంప్రదించగా ఆమె అంగీకరించలేదని తెలుస్తోంది.

కాజల్, శృతిహాసన్, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లే ఐటెం సాంగ్స్ లో నటిస్తుంటే పాయల్ మాత్రం దానికి అంగీకరించడం లేదు. ఇలాంటి పాత్రలే కావాలని పట్టుబట్టి కూర్చుంటే మాత్రం పాయల్ కి టాలీవుడ్ లో అవకాశాలు కష్టమనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి పాయల్ చేతిలో నిర్మాత సి.కళ్యాణ్ ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. 

Last Updated 9, Sep 2018, 12:33 PM IST