యాంకర్ గాయత్రీ భార్గవి ఇంట్లో తీవ్ర విషాదం.. నటి ఝాన్సీ ఎమోషనల్ కామెంట్స్

Published : Dec 27, 2023, 11:25 AM IST
యాంకర్ గాయత్రీ భార్గవి ఇంట్లో తీవ్ర విషాదం.. నటి ఝాన్సీ ఎమోషనల్ కామెంట్స్

సారాంశం

ప్రముఖ నటి, యాంకర్ గాయత్రీ భార్గవి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమెకి పితృ వియోగం కలిగింది. గాయత్రీ భార్గవి తండ్రి సూర్య నారాయణ శర్మ మరణించినట్లు తెలుస్తోంది.

ప్రముఖ నటి, యాంకర్ గాయత్రీ భార్గవి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమెకి పితృ వియోగం కలిగింది. గాయత్రీ భార్గవి తండ్రి సూర్య నారాయణ శర్మ మరణించినట్లు తెలుస్తోంది. దీనితో అభిమానులు, సినీ ప్రముఖులు గాయత్రీ భార్గవి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. 

గత కొంతకాలంగా సూర్య నారాయణ శర్మ అనారోగ్యంతో భాదపడుతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. గాయత్రీ భార్గవి లెజెండ్రీ డైరెక్టర్ బాపు గారి మనవరాలు అనే సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా గాయత్రీ భార్గవి టాలీవుడ్ లో నటిగా, యాంకర్ గా రాణిస్తోంది. క్యారెక్టర్ రోల్స్ చేస్తూ అప్పుడప్పుడూ సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తోంది. గాయత్రీ భార్గవి అత్తారింటికి దారేది, జనతా గ్యారేజ్, ప్రతి రోజు పండగే, బింబిసార లాంటి చిత్రాల్లో నటించింది. 

గాయత్రీ భార్గవి ఇంట్లో జరిగిన విషాదం గురించి మరో యాంకర్, నటి ఝాన్సీ  మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. గాయత్రీ భార్గవి తండ్రి సూర్య నారాయణ శర్మ గారు మరణించారని తెలిసి చాలా బాధపడ్డాను. ఈ సమయంలో భగవంతుడు ఆ కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలి అంటూ పోస్ట్ చేసింది. 

 

అదే విధంగా తనకి కూడా ఈ ఏడాది వ్యక్తిగతంగా ఎంతో నష్టాన్ని మిగిల్చింది అని ఝాన్సీ పేర్కొంది. తన తండ్రి, అసిస్టెంట్ శ్రీను తో పాటు పెంపుడు కుక్కని కూడా కోల్పోయినట్లు ఝాన్సీ పోస్ట్ చేసింది. 

PREV
click me!

Recommended Stories

దళపతి విజయ్ 34 ఏళ్ల కెరీర్‌లో చేసిన 16 రీమేక్‌లు..అందులో పవన్, మహేష్ బాబు ఒరిజినల్ మూవీస్ ఎన్నో తెలుసా ?
'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్ రివ్యూ..ఎన్నాళ్లకు మెగాస్టార్ ఇలా, పండక్కి బ్లాక్ బస్టర్ కొట్టే స్టఫ్ ఉందా ?